ట్రైలర్ టాక్: మాటలు లేని అనుభూతి

Update: 2018-04-10 06:00 GMT
ఇండియన్ సినిమా ప్రస్థానం మూకీగా ప్రారంభమైనప్పటికి మాటలు తోడయ్యాక వాటి ఉనికి పూర్తిగా మాయమయ్యింది. ముప్పై ఏళ్ళ క్రితం దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కమల్ హాసన్ తో పుష్పక విమానం పేరుతో ఒక ప్రయోగం చేస్తే అది బాషా బేధం లేకుండా అన్ని వర్గాలను విపరీతంగా ఆకట్టుకుని కమర్షియల్ గా విజయం అందుకుంది. తర్వాత మళ్ళి ఎవరూ సైలెంట్ మూవీ చేసే సాహసం చేయలేకపోయారు. పదేళ్ళ క్రితం వెంకటేష్ హీరోగా తీయాలని కొన్ని ప్రయత్నాలు జరిగాయి కాని స్క్రిప్ట్ కుదరక దాన్ని డ్రాప్ అయ్యారు. మళ్ళి ఇన్నాళ్లకు క్రియేటివ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఈ సాహసానికి పూనుకున్నాడు. అతను రూపొందించిన సినిమా మెర్క్యూరీ.

ప్రభుదేవా విలన్ గా కీలక పాత్ర వహిస్తున్న ఈ మూవీలో చాలా తక్కువ పాత్రలు ఉంటాయి. సనంత్ రెడ్డి-దీపక్ పరమేష్- శశాంక్ పురుషోత్తం- రేమ్యా నంబీసన్ –అనిష్ పద్మన్ – ఇందుజా నటించిన ఈ మూవీ ఒక థ్రిల్లర్. మాట విన్పించకుండా కేవలం శరీర బాషలో మాత్రం ఇందులో పాత్రధారులు మాట్లాడుకుంటారు. అనుక్షణం ఉత్కంట కలిగించే సన్నివేశాలతో ఎడ్జ్ అఫ్ ది సీట్ మూవీగా దీన్ని రూపొందించామని కార్తీక్ సుబ్బా రాజు అంటున్నాడు. ఇతని ఫస్ట్ మూవీ పిజ్జా తెలుగులో కూడా మంచి విజయం సాధించింది. రెండో సినిమా జిగర్ తాండా సెన్సేషనల్ హిట్ గా నిలిస్తే తర్వాత తీసిన ఇరైవి విమర్శకులను కూడా మెప్పించింది. అందుకే మెర్క్యూరీ మీద భారీ అంచనాలు ఉన్నాయి.

గురు ఫేం సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వగా ఒక్క పాటను మాత్రం మితూన్ కంపోజ్ చేసాడు. సూపర్ స్టార్ రజనికాంత్ తో చేసే ఆఫర్ ను కొట్టేసిన కార్తీక్ సుబ్బరాజు మరో రెండు మూడు నెలల్లో దాని షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. బొద్దుగా కనిపించే కార్తి సుబ్బరాజ్ ఈ సినిమా ప్రమోషన్ కోసమే గత రెండు మూడు రోజులుగా హైదరాబాద్ లోనే మకాం వేసాడు. సమ్మె నేపధ్యంలో తమిళనాడులో విడుదల కావడం అనుమానమే. కొత్త తరహా థ్రిల్లర్ గా రూపొందిన ఈ సైలెంట్ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ట్రైలర్ కోసం క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News