హాలీవుడ్ లో మైఖేల్ జాక్సన్ బయోపిక్

Update: 2023-01-20 15:30 GMT
వరల్డ్ మ్యూజిక్ అండ్ డాన్స్ సెన్సేషన్ అంటే వెంటనే అందరూ చెప్పే పేరు మైఖే జాక్సన్. పాప్ సింగర్ అతని గొంతుని, అతని స్టైల్ ని స్ఫూర్తిగా తీసుకుంటే.  డాన్స్ ని కెరియర్ గా ఎంచుకునే వారు మైఖేల్ జాక్సన్ డాన్స్ మూవ్మెంట్స్ ని కచ్చితంగా నేర్చుకొని చేయాలని భావిస్తారు. అతన్ని గాడ్ గా ఆరాధిస్తారు. ఇప్పటికే మైఖేల్ జాక్సన్ పాటలు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట వినిపిస్తూ ఉంటాయి. అతని డాన్స్ స్టెప్పులు ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు. ఈ రకంగా మైఖేల్ జాక్సన్ ఎంతో మందికి స్ఫూర్తి అని చెప్పాలి. అయితే పాప్ సింగర్ గా, డాన్సర్ గా విశేషమైన కీర్తిని సొంతం చేసుకున్న మైఖేల్ జాక్సన్ వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా చేదు అనుభవాలు ఉన్నాయి.

బ్లాక్ కమ్యూనిటీలో పుట్టిన మైఖేల్ జాత్యంహకార భావజాలాన్ని ఎదుర్కొన్నారు. అలాగే సక్సెస్ వచ్చిన తర్వాత తన కలర్ ని మార్చుకొని వైట్ గా మారడానికి కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టారు. అలాగే ఎప్పటికి యంగ్ గా కనిపించడం కోసం తనపైనే ఎన్నో ప్రయోగాలు చేసుకున్నాడు. ఇక అతని మరణం కూడా చాలా మిస్టరీగా జరిగింది. మైఖేల్ జాక్సన్ మీద విష ప్రయోగం జరిగిందని ఇప్పటికి కొంత మంది అంటూ ఉంటారు. అయితే అనారోగ్యంతో చనిపోయాడని కొంత మంది అంటారు. ఏది ఏమైనా అతని జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.

ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే రెండు విషయాలని మైఖేల్ జాక్సన్ జీవితం రిప్రజెంట్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు హాలీవుడ్ లో మైఖేల్ జాక్సన్ బయోపిక్ తెరకెక్కబోతుంది. ఆస్కార్ విన్నింగ్ హాలీవుడ్ దర్శకుడు ఆంటోనియా ఫక్వా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కబోతుంది. అతని కెరియర్ లో చేస్తున్న మొట్టమొదటి మ్యూజిక్ బేస్డ్ మూవీ ఇదే అని ఆంటోనియా చెప్పుకొచ్చారు. మైఖేల్ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోయే ఈ సినిమాని చాలెంజింగ్ గా తీసుకొని చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.

అతని జీవితంలో ప్రొఫెషనల్ లైఫ్ తో వ్యక్తిగత జీవితంలో అనుభవాలని కూడా ప్రేక్షకులకి ఈ సినిమా ద్వారా చూపించబోతున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమాని లైన్స్ గేటు ప్రొడక్షన్ భారీ బడ్జెట్ తో నిర్మించడానికి రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాలో టైటిల్ రోల్ కోసం మ్యూజిక్, డాన్స్ లో ప్రావీణ్యం ఉన్న ఐదు మంది టాలెంటెడ్ యాక్టర్స్ పేర్లు పరిశీలిస్తున్నారు. అయితే వారిలో ఎవరిని ఫైనల్ చేస్తారనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అని చెప్పాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News