దక్షిణాది అగ్ర కథానాయిక తమన్నా భాటియా లైనప్ లో ఉన్న చిత్రాలలో ''గుర్తుందా శీతాకాలం'' కూడా ఒకటి. ఇందులో వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ సరసన హీరోయిన్ గా నటించింది. నాగశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ లో మేఘా ఆకాష్ - కావ్య శెట్టి వంటి మరో ఇద్దరు హీరోయిన్లు కూడా కీలక పాత్రలు పోషించారు.
కన్నడలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ అనే చిత్రానికి రీమేక్ గా 'గుర్తుందా శీతాకాలం' రూపొందింది. ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడమే కాదు.. ఈ సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తిని కలిగించింది. కాకపోతే అప్పుడెప్పుడో థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా వివిధ కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది.
ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడిన 'గుర్తుందా శీతాకాలం' చిత్రానికి ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేసారు. డిసెంబర్ 9న భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్ మీట్ ని నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమంలో సినిమాలోని మహిళా ప్రధాన పాత్రలు ఎవరూ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
'గుర్తుందా శీతాకాలం' విలేఖరుల సమావేశానికి హీరో సత్యదేవ్ మరియు నటుడు ప్రియదర్శితో పాటు చిత్ర దర్శక, నిర్మాతలు హాజరయ్యారు. కానీ హీరోయిన్లు తమన్నా భాటియా - మేఘా ఆకాష్ రాలేదు. ముఖ్యంగా సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించిన తమన్నా ప్రమోషన్స్ కు రాకపోవడం ఏంటని అందరూ ఆలోచిస్తున్నారు. ఈ సినిమా ఆమెకు అసలు గుర్తుందా? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
నిజానికి 'గుర్తుందా శీతాకాలం' సినిమా విడుదల తేదీని ప్రకటించిన తర్వాత కూడా, తమన్నా తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లో కనీసం అనౌన్స్ మెంట్ పోస్టర్ ని షేర్ చేయలేదు. అలానే ప్రెస్ మీట్ లో కనిపించలేదు. దీంతో మిల్కీ బ్యూటీ ఈ సినిమా ప్రమోట్ చేయడానికి సిద్ధంగా లేదని.. అందుకే ఇలా వ్యవహరిస్తోందని నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తమన్నా ఇతర పనులతో బిజీగా ఉండటం వల్ల 'గుర్తుందా శీతాకాలం' సినిమాని ప్రమోట్ చేయడం లేదా? మరేదైనా ఇతర కారణాలతో ఈ చిత్రాన్ని లైట్ తీసుకుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి నిజమైన కారణమేంటనేది తెలియదు కానీ.. సత్యదేవ్ మరియు మిగతా టీమ్ మాత్రమే ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాల్సి వచ్చిందని టాక్ నడుస్తోంది.
సత్యదేవ్ సరసన హీరోయిన్ గా నటించడానికి తమన్నా భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏదైనా ప్రాజెక్ట్ కు సైన్ చేసేటప్పుడు ప్రమోషన్స్ కు కూడా వచ్చేలా అగ్రిమెంట్ రాసుకుంటారు. కానీ ఇప్పుడు తమన్నా 'గుర్తుందా శీతాకాలం' చిత్రం గురించి కనీసం సోషల్ మీడియాలో కూడా ప్రమోట్ చేయడం లేదు. మరి రానున్న రోజుల్లో ప్రచార కార్యక్రమాల్లో కనిపిస్తుందేమో చూడాలి.
కాగా, 'గుర్తుందా శీతాకాలం' చిత్రాన్ని ఎంఎస్ రెడ్డి సమర్పణలో నాగశేఖర్ మూవీస్ - శ్రీ వేదాక్షర మూవీస్ - మణికంఠ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రూపొందించారు. చిన బాబు - భావన రవి - నాగశేఖర్ - రామారావు చింతపల్లి నిర్మాతలుగా వ్యవహరించారు. కాలభైరవ సంగీతం సమకూర్చగా.. సత్యా హెగ్డే సినిమాటోగ్రఫీ అందించారు. లక్ష్మీభూపాల్ డైలాగ్స్ రాశారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.