అలరిస్తోన్న 'మిమీ' ట్రైలర్.. సరోగసీ ద్వారా జన్మించిన బిడ్డను కృతి ఏమి చేస్తుంది?
'1 నేనొక్కడినే' 'దోచేయ్' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ కృతి సనన్.. 'ఆదిపురుష్' సినిమాతో మరోసారి టాలీవుడ్ లో అడుగుపెట్టనుంది. దీని కంటే ముందు కృతి లీడ్ రోల్ లో నటించిన ''మిమీ'' అనే హిందీ సినిమాని ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి రెడీ చేశారు. ఇందులో పంకజ్ త్రిపాఠి మరో కీలక పాత్ర పోషించారు. కోవిడ్ నేపథ్యంలో కొంతకాలంగా విడుదల కోసం ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ మరియు జియో సినిమా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జులై 30 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ కి పెడుతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా 'మిమీ' ట్రైలర్ ను విడుదల చేశారు.
'ఈ సృష్టిలో తల్లీబిడ్డల బంధం కంటే పవిత్రమైనది లేదు.. తల్లి అవడాన్ని మించిన గిఫ్ట్ ఈ భూమి మీద లేదు' అని పంకజ్ త్రిపాఠి చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన 'మిమి' ట్రైలర్ ఆద్యంతం అలరిస్తోంది. 'అమెరికాకు చెందిన దంపతులు నీ ద్వారా బిడ్డను కనాలనుకుంటున్నారు' అని పంకజ్ చెప్పగానే.. షాక్ అయిన కృతి అతని చెంప పగలకొడుతుంది. అయితే అది సరోగసీ విధానం (అద్దె గర్భం) ద్వారా బిడ్డను కోరుకుంటున్నారని ఆమెకు వివరిస్తాడు. దీని కోసం అమెరికా దంపతులు 20 లక్షలు ఆశ చూపించడంతో.. డబ్బు కోసం సరోగేట్ తల్లిగా మారేందుకు కృతి అంగీకరిస్తుంది.
సరోగసి ద్వారా బిడ్డకు జన్మనిస్తే నా గ్లామర్ పోతుందా? అని కృతి అడుగగా.. శిల్పాశెట్టి కి గ్లామర్ తగ్గిందా అని పంకజ్ చెప్తాడు. ఈ క్రమంలో కృతి - పంకజ్ మధ్య వచ్చే సన్నివేశాలు - సంభాషణలు సరదాగా ఉన్నాయి. ఇంట్లో వాళ్లకు తెలియకుండా సరోగేట్ తల్లిగా మారిన కృతి.. పంకజ్ ఫ్లాన్ ప్రకారం వేరే చోట ఇల్లు తీసుకొని ఉంటారు. ఈ క్రమంలో పంకజ్ పడే పాట్లు నవ్వు తెప్పిస్తున్నాయి. కృతికి నెలలు నిండిన తర్వాత అమెరికా దంపతులు 'మాకు ఆ బేబీ అవసరం లేదు' అని చెప్పడంతో కథ మరో మలుపు తిరిగినట్లు అర్థం అవుతోంది. ఈ నేపథ్యంలో అబార్షన్ చేయించుకోమని కృతికి పంకజ్ సలహా ఇస్తాడు. అయితే అన్ని నెలలు కడుపులో మోసిన బిడ్డను చంపుకోవడం ఇష్టం లేని కృతి.. ఆ బిడ్డకి జన్మనిస్తుంది.
సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలియని ఆమె తల్లిదండ్రులు.. 'బిడ్డకు తండ్రి ఎవరు?' అని నిలదీయడంతో పంకజ్ వైపు కృతి వేలు చూపించింది. కృతి సనన్ - పంకజ్ ఆ బిడ్డను ఏమి చేస్తారు?, కథలో ఆ తర్వాత ఏమి జరిగింది? అనేది తెలియాలంటే ''మిమీ'' సినిమా చూడాల్సిందే. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చారు. జియో స్టూడియోస్ సమర్పణలో దినేశ్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ నెల 30న ఈ చిత్రం ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో విడుదల కానుంది.
Full View