ట్రెండీ టాక్: వైజాగ్ టాలీవుడ్ కోసం మినీ RFC

Update: 2021-07-27 06:44 GMT
హైద‌రాబాద్ మెట్రో న‌గ‌రంగా ఇప్ప‌టికే పాపుల‌ర్. ఔట‌ర్ లో రామోజీ ఫిలింసిటీ దేశానికే గొప్ప గుర్తింపు తెచ్చిన ప‌ర్యాట‌క స్థ‌లం. ఆ త‌ర్వాత తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌ముఖంగా వినిపించే  పేరు  విశాఖ‌ప‌ట్ట‌ణం. బీచ్ సొగ‌సుల విశాఖ శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతున్న న‌గ‌రంగా పాపుల‌రైంది. స్మార్ట్ సిటీగా ఇప్పుడు వేగంగా ప‌నులు సాగుతున్నాయి. ఇక విశాఖ ప‌రిస‌రాల్లోనే స‌రికొత్త టాలీవుడ్ నిర్మాణానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం స‌న్నాహ‌కాల్లో ఉండ‌గా సిటీకి క‌ల‌రింగ్ పెరుగుతోంది. వైజాగ్ టాలీవుడ్ నిర్మాణంతో విశాఖ‌ను టూరిజం హ‌బ్ కి అనుసంధానించాల‌న్న ప్లాన్ ఇన్ బిల్ట్ అయ్యి ఉండ‌డంతో దానికి భారీగా పెట్టుబ‌డుల్ని స‌మ‌కూర్చుతూ డీపీఆర్ ల‌ను వేస్తూ ఇక్క‌డ బీచ్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తుండ‌డం స‌ర్వ‌త్రా ఉత్కంఠ పెంచుతోంది.

ఇక హైదరాబాద్ ఆర్.ఎఫ్‌.సి లేదా విశాఖ చుట్టు ప‌క్క‌ల సినిమాల షూటింగుల‌కు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మెజారిటీ పార్ట్ ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తార‌న్న సంగ‌తి తెలిసిన‌దే. ఈ రెండు సిటీలు సినిమా షూటింగ్ ల‌కు ఎంతో అనువైన ప్రాంతాలుగా ప్ర‌సిద్దికెక్కాయి. అసాధార‌ణ ఇన్సిడెంట్స్ కి దూరంగా ఈ రెండు ప‌ట్ట‌ణాలు ఎప్పుడూ ప్ర‌జ‌ల‌కు భ‌రోసానిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ‌ప‌ట్ట‌ణం ఎంతో  కూల్ సిటీగా ప్ర‌సిద్ది చెందింది.

ఇక హైద‌రాబాద్ లో వెళ్లూనుకున్న స‌హ‌జ‌సిద్దంగా నెల‌కొన్న స్టూడియోలు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అన్న‌పూర్ణ‌.. రామానాయుడు.. శ‌బ్ధాల‌య .. సార‌థి స్టూడియోలు  కొన్ని సంవ‌త్స‌రాలుగా షూటింగ్ ల‌కు ప్ర‌సిద్ది చెందాయి. ఆ త‌ర్వాతి కాలంలో రామోజీ ఫిలిం సిటీ అధునాతనంగా రూపుదిద్దు కోవ‌డంతో మెజార్టీ షూటింగ్ లు ఇప్పుడు అక్క‌డే జ‌రుగుతున్నాయి.  అన్ని ర‌కాల స‌కల‌ సౌక‌ర్యాలు రామోజీ ఫిలిం సిటీ క‌ల్పించ‌డంతో బాలీవుడ్ సినిమాలు సైతం అక్క‌డ  చిత్రీక‌ర‌ణ‌  జ‌రుపుకుంటు న్నాయి. ప‌నిలోప‌నిగా ఆర్.ఎఫ్‌.సి తో పాటు అటు విశాఖ‌- అర‌కు బెల్ట్ లోనూ ఎక్కువ‌గా బ‌హుభాషా చిత్రాలు తెర‌కెక్కుతున్నాయి.

తొలి వేవ్ లాక్ డౌన్ స‌మ‌యంలో వైర‌స్ త‌గ్గుముఖం ప‌ట్టిన త‌ర్వాత రామోజీ ఫిలిం సిటీ అలాగే ట్రాఫిక్ లెస్ ప్ర‌శాంత‌ విశాఖ‌లో ప‌లువురు  అగ్ర హీరోల షూటింగ్ లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఇక్క‌డ ఉన్న ఈ సౌక‌ర్యాల కార‌ణంగా ఇప్ప‌టికీ  ఉత్త‌రాది-ద‌క్షిణాది చిత్రాల షూటింగ్ ల‌కు ఆ రెండు న‌గ‌రాల్ని ఎంపిక చేసుకోవ‌డం  తాజాగా మ‌రోసారి వెలుగులోకి వ‌చ్చింది. మ‌ల‌యాళ న‌టుడు మోహ‌న్ లాల్-జీతు జోసెఫ్‌ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న‌ సినిమా షూటింగ్ హైద‌రాబాద్ పరిస‌రాల్లోనే జ‌రుగుతోందిట‌. వాస్త‌వానికి కేర‌ళ రాష్ట్రంలో షూటింగ్ ప్లాన్ చేసారు. కానీ అక్క‌డ ఆంక్ష‌ల నేప‌థ్యంలో షూటింగ్ ని హైద‌రాబాద్ కి షిప్ట్ చేసి ఇక్క‌డే పూర్తి చేస్తున్నారుట‌. విశాఖ‌లోనూ ఏదైనా షెడ్యూల్ ఉంటుంద‌ని తెలుస్తోంది.

ఇక ప‌లు బాలీవుడ్ సినిమాలు కూడా ఇప్ప‌టికీ హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ముంబై స‌హా ప‌లు ప‌ట్ట‌ణాల్లో ఆక్షంలు ఉండటంతో హైద‌రాబాద్ ని  ఉత్త‌మంగా భావించి ఇక్క‌డే అగ్ర  హీరోలంద‌రి సినిమా షూటింగ్ లు జ‌రుగుతున్నారు.  ఇటీవ‌ల ఆమెజాన్ ఓటీటీలో రిలీజ్ అయిన `తుఫాన్` షూటింగ్ అంతా చాలా భాగం హైదరాబాద్ లోనే జ‌రిగింది. రామోజీ ఫిలింసిటీ పై బాలీవుడ్ ప్ర‌ముఖుల‌కు ఉన్న ప్రేమ‌ను చాటుకుంటున్నారు. అయితే బేస్ మెంట్ హైద‌రాబాద్ నుంచి వైజాగ్ కి షిఫ్ట్ అవ్వాలంటే విశాఖ ఔట‌ర్ లో అర‌కుహిల్స్ కి వెళ్లే దారిలో అట‌వీ ప్రాంతాన్ని కొండ‌పోడు ఎర్ర‌మ‌ట్టి నేల‌ల‌ను స‌ద్విన‌యోగం చేస్తూ మినీ రామోజీ ఫిలింసిటీ త‌ర‌హాలో ఏదైనా స్టూడియోని నిర్మించాల‌ని స్థానికంగా ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు. ఒక‌వేళ ఇదే జ‌రిగితే కొన్ని ఇత‌ర భాషా షూటింగుల‌కు ఇది ఎంతో అనువైన‌దిగా ఉంటుంద‌ని అలాగే టూరిజాన్ని ఆక‌ర్షించే ఎలిమెంట్ గా మారుతుంద‌ని భావిస్తున్నారు.
Tags:    

Similar News