ఆ హీరోకి భార్యంటే ఎంత ప్రేమో

Update: 2017-06-07 12:59 GMT
భార్యను ప్రేమించడం అనే విషయం ఏ భర్త అయినా సహజంగా చేసేదే. అయితే.. ఈ మధ్య కాలంలో తమ బెటర్ హాఫ్ ను చూసుకోవడం స్టార్ హీరోలు ఒకరితో ఒకరు పోటీ పడిపోతున్నారు. అన్ని విషయాల్లో కేర్ తీసుకుంటూ తమ ప్రేమను చాటుకుంటున్నారు.

ఇప్పుడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఈ విషయంలోనే వార్తల్లో నిలుస్తున్నాడు. షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్ పుత్ కు.. అత్యంత అందమైన స్టార్ వైఫ్ అనే గుర్తింపు ఉంది. ఈమెను యాక్టింగ్ చేయమని చాలామంది కోరారు కూడా. అయితే.. కొంత కాలం క్రితం షాహిద్ - మీరాల జంటకు చిన్నారి మిశా జన్మించిన సంగతి తెలిసిందే. మరీ గర్భం దాల్చి ప్రసవం అయిన తర్వాత అంటే.. ఆ సమయంలో మహిళలు కాస్త లావవడం సహజంగా కనిపించే విషయమే. అలాగని ఆమె తన హెల్త్ ను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా చర్యలు తీసుకుంటున్నాడు షాహిద్.

బిడ్డ ఆలనాపాలనలో పడి తన ఆరోగ్యం గురించి పట్టించుకోవడం మానేసే ప్రమాదాన్ని శంకిచిన షాహిద్.. ఆమెకు పర్సనల్ ట్రైనర్ అయిపోయాడు. ఈ మధ్య కొంతకాలంగా వీరిద్దరూ కలిసి జిమ్ లో తెగ వర్కవుట్స్ చేసేస్తుండడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News