అల్లరి నరేష్ మ‌రో ప్ర‌యోగంలో మ‌ర్నా

Update: 2022-09-03 04:50 GMT
అల్ల‌రి న‌రేష్ న‌టించిన ప్ర‌యోగాత్మ‌క చిత్రం 'నేను' క్రిటిక్స్ ప్ర‌శంస‌లు అందుకున్నా బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన స్థాయిని అందుకోలేదు. ఆ సినిమాలో న‌రేష్ న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది. అయితే మ‌రో ప్ర‌యోగాత్మ‌క చిత్రం 'నాంది'తో న‌టుడిగా పేరు తెచ్చుకోవ‌డ‌మే గాక‌.. క‌మ‌ర్షియ‌ల్ గా విజయం సాధించాడు. ఈ చిత్రానికి విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌కుడు. ఇప్పుడు నాంది కాంబినేష‌న్ రిపీట‌వుతోంది.

హీరో అల్లరి నరేష్ - దర్శకుడు విజయ్ కనకమేడల విజయవంతమైన కాంబినేషన్ తిరిగి వారి రెండవ చిత్రానికి ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసింది.  దీనికి ఉగ్రం అనే పేరు పెట్టారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ పోస్టర్ ను విడుదల చేయడంతో క్యూరియాసిటీ నెలకొంది. ఫస్ట్ లుక్ లో అల్లరి నరేష్ శరీరం నిండా గాయాలతో ఉగ్రరూపం దాల్చాడు.

లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో మర్నా కథానాయికగా నటిస్తుంది. ఈ బ్యూటీ ఇంతకుముందు మోహన్ లాల్ బిగ్ బ్రదర్ తో సహా తమిళం - మలయాళ సినిమాలలో నటించింది. తెలుగులో ఆమెకు ఇది రెండో సినిమా.

విజయ్ కనకమేడల తన మొదటి చిత్రం నాందిలో తన రచన  టేకింగ్ తో క్రిటిక‌ల్ గా ప్ర‌శంస‌లు అందుకున్నాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఫ‌ర్వాలేద‌నిపించే వ‌సూళ్ల‌ను సాధించింది. అత‌డు మరో ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ రాసి అల్లరి నరేష్ ని ఇంటెన్స్ క్యారెక్టర్ లో చూపించనున్నాడు.

సాహు గారపాటి - హరీష్ పెద్ది షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సంస్థ‌ నుండి ప్రొడక్షన్ నంబర్ 5గా ఇది రూపొంద‌నుంది. గతంలో కృష్ణార్జున యుద్ధం- మజిలీ- గాలి సంపత్ - టక్ జగదీష్ వంటి అనేక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లను రూపొందించారు.

ఉగ్రం అతి త్వరలో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. కొంతమంది ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలను పోషించనున్నారు. ఇందులో 'నాంది'కి ప‌ని చేసిన అదే సాంకేతిక బృందం ఉగ్రంలో భాగం కానున్నారు. తూమ్ వెంకట్ కథను అందించగా,.. అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా,.. సిద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిట్ చేయనున్న ఈ చిత్రానికి బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు.. సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News