తెలుగు సినిమా వంద కోట్ల రేంజికి ఎదిగిపోయిందని.. కొన్ని సినిమాలు పెట్టుబడి మీద రెట్టింపు వసూలు చేస్తున్నాయని సంబరపడిపోతున్నాం కానీ.. బడ్జెట్లు హద్దులు దాటిపోయి.. బాక్సాఫీస్ దగ్గర ఫలితం తేడా రాగానే ఇటు నిర్మాతను.. అటు బయ్యర్లను నిలువునా ముంచేస్తున్న డిజాస్టర్లు కూడా తక్కువేమీ కాదు. రెండు నెలల కిందట ‘ఓం నమో వేంకటేశాయ’ మిగిల్చిన చేదు అనుభవం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు అంత దారుణమైన ఫలితం వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. కనీసం పెట్టుబడిలో సగమైనా రాబట్టలేకపోయిందా చిత్రం. ఇప్పుడు ‘మిస్టర్’ సినిమా దానికి దీటుగా నిలుస్తోంది. ఈ సినిమా సైతం పెట్టుబడిలో మూడో వంతు వసూళ్లకు పరిమితం అయ్యేలా కనిపిస్తోంది.
రూ.20 కోట్లకు పైగా బడ్జెట్లో తెరకెక్కిన ‘మిస్టర్’.. బిజినెస్ కూడా అదే స్థాయిలో చేసింది. ఐతే ఫుల్ రన్లో ఈ చిత్రం కనీసం పది కోట్లు కూడా వసూలు చేసే పరిస్థితి కనిపించలేదు. ఆ సినిమా ఫైనల్ షేర్ రూ.8 కోట్లకు అటు ఇటుగా తేలేలా కనిపిస్తోంది. శ్రీను వైట్ల ఎంత ఫాంలో లేకపోయినా.. వరుణ్ తేజ్ అప్ కమింగ్ హీరో అయినా.. ఈ సినిమాకు ఎలాంటి టాక్ వచ్చినా రూ.15 కోట్ల షేర్ గ్యారెంటీ అని అంచనా వేశారు. కానీ ఈ సినిమా పేలవమైన వసూళ్లతో సాగుతోంది. వీకెండ్లోనే వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోగా.. ఆ తర్వాత పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. శ్రీను వైట్ల ఇమేజ్ ఎంతగా డ్యామేజ్ అయింది.. ఆతడి సినిమాలపై ప్రేక్షకులకు ఎంతగా నమ్మకం పోయింది అనడానికి ‘మిస్టర్’ రుజువుగా నిలుస్తోంది. ఒకప్పుడు అతడి పేరు చూసి మరో ఆలోచన లేకుండా థియేటర్లకు వచ్చేసిన ప్రేక్షకులు.. ఇప్పడు అతడి పేరు చూసి కంగారు పడే పరిస్థితి. ఇంత వేగంగా క్రెడిబిలిటీ కోల్పోయిన దర్శకులు చాలా అరుదనే చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/