వైట్లకు ఆ కెపాసిటీ ఇంకా ఉందా!!

Update: 2017-04-11 04:07 GMT
ఓవర్సీస్ మార్కెట్లో హీరోల కంటే డైరెక్టర్లకే ఎక్కువ ఫేమ్ ఉంటుందని అనడంలో సందేహం లేదు. దర్శకుడి బ్రాండ్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అక్కడి జనాల స్టైల్. ఓవర్సీస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో శ్రీను వైట్లకు మంచి ట్రాక్ రికార్డ్ ఉండేది. దూకుడు.. బాద్ షా వంటి వైట్ల మార్క్ కామెడీ చిత్రాలు అక్కడ బాగా ఫేర్ చేశాయి.

కానీ ఆగడు.. బ్రూస్ లీ దగ్గరకు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. అదే మార్క్.. సేమ్ మేకింగ్ స్టైల్ రిపీట్ కావడంతో పట్టించుకోవడం మానేశారు యూఎస్ ఆడియన్స్. ఇప్పుడు తన లేటెస్ట్ మూవీ మిస్టర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు శ్రీను వైట్ల. ఈ చిత్రానికి మొదట టీజర్ ను రిలీజ్ చేసినపుడు.. ఫ్రెష్ ఫీలింగ్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత ట్రైలర్ విడుదల చేశాక మాత్రం.. మళ్లీ రొటీన్ కంటెంట్ అనే ఫీలింగ్ వచ్చేసింది. ఇప్పుడు యూఎస్ ఆడియన్స్ ను ఏ మేరకు వైట్ల మెప్పిస్తాడనే ఆసక్తి కనిపిస్తోంది.

హీరో వరుణ్ తేజ్ కు ఓవర్సీస్ లో ఇంకా మార్కెట్ క్రియేట్ కాలేదనే మాట వాస్తవం. ఇక్కడ మెగా ఫ్యాన్స్ నుంచి సపోర్ట్ లభించి ఓపెనింగ్స్ వచ్చినా.. ఓవర్సీస్ భారం మాత్రం వైట్ల భుజాలపైనే ఉంటుంది. కంటెంట్ బాగుంటే.. ఈ మీడియం బడ్జెట్ మూవీని సగానికి సగం సేఫ్ జోన్ లోకి తెచ్చే కెపాసిటీ ఓవర్సీస్ సొంతం. అందుకే శ్రీను వైట్ల ఓవర్సీస్ నుంచి మిస్టర్ ద్వారా ఎంత రాబట్టగలుగుతాడని ట్రేడ్ జనాలు చూస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News