ఎమ్మెల్యే వ్యాపారం అంటే.. అదేమీ ఏ పొలిటికల్ పర్సనాలిటీకి సంబంధించిన వ్యవహారం కాదు లేదు లెండి. ఇది ఎమ్మెల్యే మూవీ చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ సంగతి.. అంతే. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సినిమా వచ్చి ఏడాదిన్నర గడిచిపోయింది. ఆ చివరగా వచ్చిన మూవీ ఇజం. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం దారుణమైన ఫలితాన్ని అందుకుంది.
ఆ తర్వాత నిర్మాతగా ఎన్టీఆర్ తో జై లవకుశ మూవీ చేసిన కళ్యాణ్ రామ్.. ఇప్పుడు ఎమ్మెల్యే మూవీని రిలీజ్ కి రెడీ చేసేశాడు. మార్చ్ 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సక్సెస్ ట్రాక్ లో లేని హీరో.. దర్శకుడికి ఇదే మొదటి సినిమా లాంటి పరిస్థితుల్లో.. ఈ చిత్రం బిజినెస్ ఎలా జరుగుతుందో అని ట్రేడ్ జనాలు ఆసక్తిగానే ఎదురుచూశారు. కానీ టీజర్ నుంచి ఆకట్టుకున్న ఈ మూవీకి.. బజ్ బాగానే ఉండడంతో.. ప్రీ రిలీజ్ బిజినెస్ ను అనుకున్న స్థాయిలోనే పూర్తి చేయగలిగారు. కళ్యాణ్ రామ్ నటించిన ఎమ్మెల్యే.. ఏకంగా 22 కోట్ల రూపాయల వ్యాపారం చేసేయడం విశేషం. నైజాం రైట్స్ 4.2 కోట్లు.. ఆంధ్ర 6.3 కోట్లు.. సీడెన్ ను 2.5 కోట్ల రూపాయలకు విక్రయించారు.
ఓవర్సీస్ తో పాటు ఇతర ఏరియాల నుంచి థియేట్రికల్ హక్కుల రూపంలో 5 కోట్ల వరకూ వచ్చాయి. అలా మొత్తం 22 కోట్ల రూపాయల బిజినెస్ ను చేసుకుంది ఈ చిత్రం. ప్రింట్స్ తో పాటు ఇతర ఖర్చులు 2 కోట్ల వరకూ కానుండగా.. ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే దాదాపు 25 కోట్ల టార్గెట్ ను సెట్ చేసుకుని థియేటర్లలోకి వస్తోంది.