తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన దర్శకరత్న దాసరి నారాయణరావు ఆరోగ్యంపై ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. ఉన్నపలంగా ఆయన ఆస్పత్రిపాలయ్యేసరికి సినీ ఇండస్ట్రీ మొత్తం ఆందోళన చెందింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ఆరోగ్యం కాస్త నిలకడగా ఉందని తెలుస్తోంది.
ఊపిరితిత్తులు - మూత్రపిండాల్లో ఇన్ఫెక్షన్ కారణంగా దాసరి సోమవారం కిమ్స్ ఆసుపత్రిలో చేరిన దాసరికి మంగళవారం మధ్యాహ్నం కిమ్స్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు పేరున విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో.. ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందిస్తున్నారని, ఇన్ఫెక్షన్ తొలగించడానికి శస్త్ర చికిత్స చేయనున్నారని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శస్త్ర చికిత్స కూడా పూర్తయింది.
ఈ విషయాలపై మాట్లాడిన డాక్టర్ భాస్కరరావు... అన్నవాహికలో ఉన్న పదార్థాల వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందని.. వాటన్నింటినీ శస్త్రచికిత్స ద్వారా తీసేశామని వెల్లడించారు. ప్రస్తుతానికి దాసరి చాలా బాగున్నారని.. రెండు మూడు రోజుల్లో కోలుకోడానికి ఆస్కారం ఉందని.. ఇది చాలా సెన్సిటివ్ విషయం కావడంతో ఇంతకుమించి ఇప్పటికి ఇంకేమీ చెప్పలేమని అన్నారు.
అనంతరం మాట్లాడిన మోహన్ బాబు... తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ తన గురువు కావల్సిన మనిషని.. దాసరి నూరేళ్లు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని.. అందరూ కూడా ఆయన ఆరోగ్యం గురించి ప్రార్థించాలని కోరారు. ఇదే సమయంలో డాక్టర్స్ ఏమిచెప్పారో దయచేసి అదే విషయం ప్రజలకు తెలపాలని మోహన్ బాబు మీడియాకు సూచించారు. అలాగే, ఉదయం నుంచి కిమ్స్ లోనే ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు మోహన్ బాబు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/