నట సార్వభౌమగా ఇటీవలే బిరుదు అందుకున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా గ్యాప్ తర్వాత మేకప్ వేసుకుని డ్యూయల్ రోల్ చేసిన గాయత్రి సినిమా ప్రస్తుతం మిక్స్డ్ టాక్ తో రన్ అవుతోంది. తనవరకు నిరాశ పరచకుండా అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చినప్పటికి కథా కథనాల మీద వస్తున్న కొన్ని విమర్శల వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర స్లోగానే ఉంది గాయత్రి. సోలోగా రిలీజ్ అయ్యుంటే ఎలా ఉండేదో కాని ప్రస్తుతానికి మాత్రం ఇబ్బందులైతే పడుతోంది. తాజాగా ఓ మీడియా వెబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్ బాబు పలు విషయాల గురించి చాలా ఓపెన్ గా మాట్లాడ్డం చర్చనీయంశంగా మారింది. తన సినిమాలు మొదలుకొని వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా సూటిగా సమాధానాలు చెప్పేసారు మోహన్ బాబు.
తన గురించి తన ప్రవర్తన గురించి తానంటే గిట్టని కొందరు హీరోలు దుష్ప్రచారం చేయటం వల్ల హీరొయిన్లు కొంతమంది తనతో నటించడానికి భయపడ్డారని, కాని అది తప్పుడు ప్రచారం అని అర్థం చేసుకున్నవాళ్ళు నటించారని చెప్పారు . కొత్త తరం దర్శకులు తానంటే భయపడే మాట నిజమే అయితే రాజమౌళి - పూరి జగన్నాధ్ తనతో చాలా కంఫర్టబుల్ గా వర్క్ చేసారని, వాళ్ళు ఆ మాట చెప్పిన ఉదంతాన్ని గుర్తు చేసారు. క్లబ్బుల్లో కలిసి లేదా మందు పార్టీలు ఇచ్చి ప్రసన్నం చేసుకునే బ్యాచ్ తాను కాదని. అలాంటివి కోరనప్పుడు తన దగ్గరకు రావడానికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.
తాను ఓ సందర్భంలో దర్శకుడు సూర్యకిరణ్ ని - మరోసారి ఇంకో హీరొయిన్ ని కొట్టాననే వార్త కూడా కల్పితమే అన్న మోహన్ బాబు తాను డిసిప్లిన్ తప్పినప్పుడు కేవలం మందలిస్తానని, ఆ రోజు నేను అలా చేశాను అని అబద్దాలు చెప్పిన హీరొయిన్ ఈ రోజు పూట భోజనానికి కూడా ఇబ్బంది పడుతున్న సంగతి తనకు తెలుసన్నారు. సినిమా సెట్ లో పేకాడే వారిని మాత్రం ఆయన ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అలా ఆడే వాళ్ళంటే తనకు అసహ్యం అన్న మోహన్ బాబు ఓసారి సినిమా సెట్ లో కొందరు ఆడుతుంటే టేబుల్ ని కాలితో తన్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. సెటిల్ మెంట్లు, రౌడీయిజం గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు తొణక్కుండా అలా ఋజువు చేస్తే కాల్చుకు చనిపోతానన్న కలెక్షన్ కింగ్ తనను బినామి అని అన్నం తిన్నవాడు ఎవడు అనడు అని ఫైర్ అయ్యారు. దాసరి, పరిటాల, రజనికాంత్ లతో తనకున్న అనుబంధం గురించి ప్రశ్న వచ్చినప్పుడు ఆయన ఇలా ఘాటుగా స్పందించారు
ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్టు చెబుతారు అనే పేరున్న మోహన్ బాబు ఇంటర్వ్యూలో సైతం అదే ధోరణి కొనసాగించడం విశేషం. గాయత్రి ఫలితం తర్వాత సినిమాలు చేయటం గురించి నిర్ణయం తీసుకుంటాను అన్న మోహన్ బాబు ప్రస్తుతానికి అయితే కొత్త ప్రాజెక్ట్ గురించి ఏది ఆలోచించలేదు.