ముక్కుసూటిగా మాట్లాడటంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తర్వాతే ఎవరైనా అనేది ఇండస్ట్రీ వర్గాల్లో అధిక శాతం అభిప్రాయంగా ఉన్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత సోలో హీరోగా డ్యూయల్ రోల్ లో సినిమా చేస్తున్న మోహన్ బాబు ‘గాయత్రి’తో వచ్చే వారం కుర్ర హీరోలతో పోటీ పడబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు సంచలనంగా మారుతున్నాయి. టాలీవుడ్ ని తమ పెత్తనంలో ఉంచుకుని థియేటర్ల మీద గుత్తాధిపత్యం చెలాయిస్తున్న ఆ నలుగురి గురించి అడిగినప్పుడు మోహన్ బాబు తనదైన శైలిలో స్పందించారు. ఇది నిజంగా తీవ్రమైన సమస్యే అన్న మోహన్ బాబు దాసరి గారి స్థానంలో తాను దీని మీద పోరాడడానికి సిద్ధంగా ఉన్నానని - కాని చిన్న నిర్మాతలు ఎవరైతే బాధితులుగా ఉన్నారో వారే చివరి నిమిషంలో తప్పుకుంటారని - తిరిగి వెనక్కు చూసుకుంటే ఎవరు ఉండరని అలాంటప్పుడు అందరికి విరోధిగా మారాల్సిన అవసరం తనకు లేదని తేల్చి చెప్పారు.
ఇక నంది అవార్డుల గురించి కూడా మోహన్ బాబు ఫైర్ అయ్యారు. కులాల ప్రతిపాతికన ఇస్తున్న మాట నిజమేనని తనలాంటి వాళ్ళకు ఎందుకు ఇవ్వడం లేదు అనేది న్యాయ నిర్ణేతలను అడిగితే బాగుంటుందని, అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడ్డం నీచం అని తేల్చేసారు. అవార్డుల కేవలం రికమండేషన్ల మీదే తెచ్చుకుంటారని, తన బిడ్డలతో సహా తన కుటుంబంలో అలాంటివి చేయరని నమ్ముతున్నా అని చెప్పేసారు. ప్రజల ఆదరణ ఉన్నప్పుడు అవార్డుల గురించి తాను పట్టించుకోనని స్పష్టం చేసేసారు కలెక్షన్ కింగ్. మంచు లక్ష్మి కూడా అవార్డు వచ్చిన వాళ్ళ లిస్టులో ఉన్న నేపధ్యంలో మోహన్ బాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తన కుటుంబాన్ని పరిశ్రమ పట్టించుకోలేదు అనే మాటలను ఆయన ఖండించారు.
మొత్తానికి తన మనసులో ఉన్న మాటలను చాలా ఓపెన్ గానే చెప్పేసారు మోహన్ బాబు. ఈ నెల 9న విడుదల కానున్న గాయత్రి సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ అదే రోజు రావాలని డిసైడ్ అయిపోయి ఆ మేరకు పోస్టర్లు కూడా విడుదల చేసారు. తమన్ అందించిన మ్యూజిక్ ఆకర్షణగా నిలుస్తుండగా చాలా కాలం నుంచి సక్సెస్ కు దూరంగా ఉన్న మదన్ దీనికి దర్శకత్వం వహించడం విశేషం. మరి యూత్ తో పోటీలో కలెక్షన్ కింగ్ నెగ్గుతారో లేదో వచ్చే వారం తేలనుంది.