మా ఎన్నికల హడావుడి ఇంకా కొనసాగుతూనే ఉంది. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలిచిన తర్వాత జరిగిన పరిణామాలు.. అంతకు మందు పరిణామాలు అన్ని మీడియాలో ఏ రేంజ్ లో రచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ ఎత్తున వివాదాలకు దారి తీసిన మా ఎన్నికలు ఇప్పుడు మోహన్ బాబు పై కేసు నమోదు అయ్యే వరకు వెళ్లింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మోహన్ బాబు పై కేసు నమోదు అయ్యింది. ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ గొర్లు.. మేకల పెంపకం దారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఆయన మాట్లాడాడు అంటూ వారు కొన్ని వీడియో సాక్ష్యాలను కూడా పోలీసులకు సమర్పించారని తెలుస్తోంది.
మా ఎన్నికల తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలపై మోహన్ బాబు స్పందించాడు. ఆ సమయంలో కొందరిని తీవ్రంగా విమర్శించాడు. ఆయన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారం రేపాయి. ఇండస్ట్రీలోని ఒక వర్గంను ఆయన కించపర్చినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడు ఆయన గొర్లు మేకలను కాచే వారిని కించ పర్చే విధంగా మాట్లాడాడు అంటూ ఆ సంఘం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో పోలీసులు తీసుకోబోతున్న యాక్షన్ ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మా ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే చాలా రచ్చ జరిగింది. ఇప్పుడు ఈ కేసు మరింతగా చర్చనీయాంశంగా మారింది.
మా ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్ కు మెగా కాంపౌండ్ మద్దతు లభించగా మంచు విష్ణు కు ఇండస్ట్రీ ప్రముఖుల నుండి మద్దతు దక్కింది అనేది టాక్. ప్రకాష్ రాజ్ స్థానికుడు కాకపోవడం వల్ల ఆయన్ను మా సభ్యులు ఓడించారు. అయితే మా లో ఇలాంటి కుంచిత స్వభావం ఉన్న వారు ఉన్న కారణంగా నేను మా సభ్యత్వంను వదులుకుంటున్నట్లుగా నాగబాబు ప్రకటించాడు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ కూడా రాజీనామా చేస్తున్నట్లుగా పేర్కొన్నాడు. అంతే కాకుండా ప్రకాష్ రాజ్ ప్యానల్ తరపున పోటీ చేసి గెలిచిన ప్రతి ఒక్కరు కూడా రాజీనామా చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇలా ఎన్నో వివాదాలు మా ఎన్నికల తర్వాత కూడా నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో మోహన్ బాబు వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బ తీశాయి అంటూ మేకల కాపర్లు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.