#MB40: విలక్షణ నటుడి జీవితమే ఓ పాఠం

Update: 2016-09-17 18:00 GMT
మంచు మోహన్ బాబు సినీ పరిశ్రమలో ప్రవేశించి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. విశాఖలో కన్నుల పండుగగా ఎంబీ40 ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో మోహన్ బాబు ఎన్నో సంగతులు పంచుకున్నారు.

'గురువు దాసరి.. ఆత్మీయులు మంత్రి గంటా శ్రీనివాసరావు - స్టేజ్ పై ఉన్న తోటి నటులు.. అందరికీ నమస్కారాలు.. ఎక్కడ మొదలు పెట్టాలంటే.. ఇది  సుదీర్ఘమైన ఉపన్యాసం. చిత్తూరు చిల్లా మలయాళ స్వామి ఆశ్రమం ఏర్పేడు దగ్గర మొదలైంది జీవితం. మధ్య తరగతిలో పుట్టాను. నాన్న టీచర్. డబ్బులేక ఎక్కువ చదువుకోలేక బీఏ చదివి ఆపేసి.. పీఈటీ టీజర్ గా చేసి.. మద్రాస్ లో ఏడాది ఉద్యోగం చేసి.. వాళ్ల కులం వాడు కాదని ఉద్యోగంలోంచి తీసేస్తే.. కారు షెడ్ లో జీవితం ప్రారంభించి.. ఫ్లాట్ ఫాం పై పడుకుని.. జీవితంలో నటుడవ్వాలనే ప్రయాణం చేశాను' అని చెప్పారు మోహన్ బాబు.

'ఈ ప్రయాణంలో మొదట కనిపించిన వ్యక్తి దాసరి. ఆయన కోడైరక్టర్ రైటర్ గా పనిచేసిన సినిమాకు అప్రెంటీస్ గా చేస్తే.. ఆరు మాసాలకు 50 రూపాయలు జీతం ఇచ్చారు. ఆ తర్వాత తాతినేని రామారావు దగ్గర 200రూపాయలకు అసిస్టెంట్ గా పని చేశాను. కష్ట నష్టాలు ఎదుర్కుని.. తిండి లేక.. రూమ్ రెంట్ లు కట్టుకోలేక.. పెట్టేబేడా బైట పారేస్తే.. ఫ్లాట్ ఫాంపై పడుకుని.. ఒకే జత బట్టలు కట్టుకుని కష్టాలు పడ్డాం. టాయ్ లెట్ లేక.. తడికలు కట్టుకుని స్నానం చేస్తూ బతికాం. మామూలు కష్టాలు కాదు.' అన్నారు మోహన్ బాబు.

'ప్రయాణంలో ఓ పొజిషన్ కి వచ్చేవరకూ.. దాసరి స్వర్గం నరకం తీసే వరకూ తినీ తినకుండా కష్టపడ్డాం. 1975లో దాసరి ఫ్యామిలీ ఉప కథనాయకుడి పాత్ర ఇచ్చారు. నేను విలన్ పాత్రలను వేయాలనే పల్లెటూరి నుంచి వచ్చా.. హీరో పాత్రల కోసం కాదు. అలా ప్రారంభమై.. మహా నటులతో యాక్ట్ చేసి.. దాదాపు 560 చిత్రాల్లో నటించి విభిన్నపాత్రలు పోషించి.. 60చిత్రాలకు పైగా నిర్మించి.. విద్యాలయాలు పెట్టి17 సంవత్సరాల క్రితం మహా నటుడు ఎన్టీఆర్-చంద్రబాబు ఆశీస్సులతో పార్లమెంటుకు వెళ్లి.. ఇన్ని సాధించానంతే నా తల్లిందండ్రుల ఆశీస్సులు. గురువు దాసరి ఆశీస్సులు' అని చెప్పారు మోహన్ బాబు.

'30 రూపాయల రెంట్ కట్టలేదని.. ఇంటి ఓనరు.. నేను అన్నం వండుకునే పాత్రలో మల విసర్జన చేశాడు. అలా ఎన్నో కష్టాలు అనుభవించా. అందుకే విద్యాలయాలు పెట్టినపుడు కులమతాలకు అతీతంగా ప్రారంభించా. దాదాపు 14500 స్టూడెంట్స్. దేశంలో 3600 కాలేజ్ లు ఉంటే మనది ఆరో స్థానంలో ఉంది. కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్నా' అన్నారు మోహన్ బాబు.

' పెళ్లి చూపుల్లో ఉండే ప్రేమ.. తాళి కట్టాక ప్రేమ.. ఐదారేళ్ల తర్వాత ప్రేమ మారుతూ ఉంటుంది. పిల్లలు పుట్టాక ప్రేమ మారుతూ ఉంటుంది. పంటికి ఇచ్చే ప్రాధాన్యత.. నాలుకకు ఇవ్వం. పిల్లలు పెరిగే కొద్దీ ఒక్కొక్కడ బిడ్డా.. పంటి లాగే దూరమవుతూ ఉంటారు. చివరి వరకు ఉండేది నాలుక.. అదే భార్య.. ఆ భార్యకు ప్రాధాన్యత.'అని చెప్పారు మోహన్ బాబు

'పుణ్యభూమి నా దేశం.. కలకాలం నిలిచిపోయే పాట. ఆస్తులు తాకట్టు పెట్టి.. ఎన్టీఆర్ తో సినిమా తీసి  .. అన్నయ్యా మళ్లీ ముఖ్యమంత్రిగా చూస్తా అన్నాను. చిరంజీవి పెద్ద కూతురు కూడా.. చిరు తండ్రి లాగే నన్ను ప్రేమగా చూస్తోంది.. అంకుల్ అంకుల్ అంటోంది. ఇక రామానాయుడు గారి కుటుంబంగురించి చెప్పాలంటే. నటుడిగా సక్సెస్ అయినా.. ఫెయిల్ అయినా.. రెమ్యూనరేషన్ ఇచ్చేయాలనే క్రమశిక్షణ రామానాయుడు నేర్పించారు. ఆయన కుటుంబం అంటే.. నాకు ఎంతో ప్రేమ అనుబంధం' అంటూ గతాన్ని పంచుకున్నారాయన.

'వెంకటేష్ మీ కుటుంబం అంతా వచ్చారు. చిరంజీవి షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చావ్.. థాంక్యూ. జైపూర్ లో షూటింగ్ లో నుంచి వచ్చింది జయప్రద వచ్చింది. ఇప్పటికీ చెదరని అందం.. భార్య ఉంది కానీ.. లేకపోతే ఇప్పటికీ చూసినప్పుడు లొట్టలేసుకుంటూ ఉంటాను. ఆమెకు హీరోగా.. విలన్ గా చేశాను. ఎంతో ప్రేమగా ఫ్లైట్ మారి వచ్చింది. జయసుధ నాకు నిజజీవితంలో చెల్లెలు. మా ఇద్దరిదీ అన్నా చెల్లెళ్ల అనుబంధం.  నేను అసిస్టెంట్ డైరక్టర్ గా తనకు క్లాప్ కొట్టాను.. నేర్పించాను.. అదే జయసుధతో హీరోగా చేసి 25వారాలు ఆడిన గృహప్రవేశం. 50వారాలు శివరంజనిఇది డెస్టినీ.. భగవంతుని ఆశీస్సులు' అంటూ అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు.

'క్రమశిక్షణ.. దీక్ష.. పట్టుదల ఉండబట్టే.. ఇంత సుదీర్ఘ ప్రయాణం చేయగలిగా..శ్రీదేవి లండన్ లో ఉంటే.. బోనీకపూర్ కి చెబితే.. ఒకటే ఫోన్ కాల్ తో కుటుంబమంతా వచ్చింది. జయసుధ.. శ్రీదేవి.. మా తిరుపతి వాళ్లే. వేదిక మీదున్న అందరికీ నా విషెస్ ఉంటాయ్. బి గోపాల్ తో నాలుగు సూపర్ హిట్స్ చేశాను. రవిరాజా పినిశెట్టితో పెదరాయుడు లాంటి చరిత్రలో నిలిచిపోయే సినిమా చేశా. డైలాగ్ ఇక్కడ నొక్కాలి.. అని కాలితో తన్ని మరీ నేర్పించారు దాసరి. మోహన్ బాబుకి డైలాగ్ ఉండాలని ప్రత్యేకంగా రాశారు పరుచూరి సోదరులు. నాగబాబు అంటే నాకు ఇష్టం.. ఎక్కడికీ రాడు. నేను పిలిచానని కడియం నుంచి ఇక్కడివరకూ కారులో వచ్చాడు. శాంతా బయోటెక్ ఎండీ వరప్రసాస్ రెడ్డి కూడా అమెరికా నుంచి వచ్చారు.' అని చెప్పారు మోహన్ బాబు

'జేసుదాస్.. గృహప్రవేశం నుంచి మొదలై ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సాధువులా కనిపించినా.. ముక్కోపి ఆయన. నా ప్రేమకు ఆయన దాసోహం అయిపోయాడు జేసుదాస్. ఇంతకీ సుబ్బిరామిరెడ్డి ఎందుకు ఈ ఫంక్షన్ చేయాలి.. నాకు సన్మానం చేస్తే.. బిరుదిస్తే ఆయనకేంటి ఉపయోగం. గతంలో రాజులు కళాకారులకు సన్మానం చేసేవారు. గత 40 ఏళ్లుగా సన్మానాలు చేస్తున్నారాయన. చేయాలనే ఆలోచన రావడమే గొప్ప విషయం. మీరు లేకపోతే కళాకారులను సన్మానాలు చేసేవారు లేరు' అంటూ సుబ్బిరామి రెడ్డికి నమస్కారాలు చేశారు మోహన్ బాబు.

'స్నేహంలో చివరివరకూ ఉండాలని అనుకునే వాడు ఆలీ.. మధ్యలో టోకరా వేసి వెళ్లిపోయేవాడు బ్రహ్మానందం' అంటూ నవ్వేసిన మోహన్ బాబు.. వారిద్దరికీ కృతజ్ఞతలు తెలిపాడు. 'మీ ఆశీస్సుల కోసం వైజాగ్ వస్తుంటాను అన్న మోహన్ బాబు.. యాంకర్ ఝాన్సీని.. ఝాన్సీ లక్ష్మీబాయ్ అనేశారు మోహన్ బాబు. 'నెక్ట్స్ 40 ఇయర్స్ ఫంక్షన్ నీదే చిరంజీవీ.. తర్వాత వెంకటేష్ ది. నేనే ఆర్గనైజ్ చేస్తా..' అంటూ తన స్పీచ్ ముగించారు మోహన్ బాబు.
Tags:    

Similar News