60 ఏళ్ల వయసులో జిమ్ లో శ్రమిస్తున్న స్టార్ హీరో..!

Update: 2021-04-19 18:30 GMT
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డబ్బింగ్ సినిమాలతో అలరించిన మోహన్ లాల్.. 'గాండీవం' చిత్రంలోని ఒక పాటలో అతిథిగా పలకరించాడు. 'జనతా గ్యారేజ్' 'మనమంతా' సినిమాలలో తన సహజమైన నటనతో అందరిని ఆకట్టుకున్నారు కంప్లీట్ యాక్టర్. పాత్ర ఏదైనా దానికి పూర్తి న్యాయం చేసే మోహన్ లాల్.. 60 ఏళ్లకు పైబడిన వయసులో కూడా పాత్రకు తగ్గట్టుగా తన ఫిజిక్ ని మలచుకుంటారు. దీని కోసం క్రమం తప్పకుండా జిమ్ లో కఠోర వ్యాయామాలు చేస్తూ బాడీని ఫిట్ గా ఉంచుకుంటారు. తాజాగా కంప్లీట్ యాక్టర్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న ఓ ఫోటోని సోషల్ మీడియాలో స్వయంగా పోస్ట్ చేశారు.

ఈ ఫొటోలో జిమ్ సూట్ లో ఉన్న మోహన్ లాల్.. ఫుట్ బాల్ ప్లేయర్ తరహాలో కనిపిస్తున్నాడు. వయసు మీద పడినా ఆ ప్రభావం తన పాత్రల మీద కనపడదంటే కారణం, ఇలా ప్రతి రోజు వర్కౌట్స్ చేయడమే అని అర్థం అవుతోంది. ప్రస్తుతం జిమ్ లో  ఉన్న సీనియర్ హీరో ఫోటో సోషల్ మీడియా మధ్యమాలలో వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇప్పటికే 'దృశ్యం 2' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన మోహన్ లాల్.. 'ఆరాట్టు' అనే సినిమాని రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అలానే ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న 'మరక్కార్ అరబికదలింటే సింహం' సినిమాని కూడా త్వరలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక 'బరోజ్' అనే 3డీ సినిమాతో దర్శకుడిగా మెగా ఫోన్ చేతపట్టారు కంప్లీట్ యాకర్ట్. మోహన్ లాల్ ఇలా ఆరు పదుల వయస్సులో క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా గడుపుతున్నారు.
Tags:    

Similar News