కింగ్ నాగార్జున- అఖిల్ ఒకే ప్రేమ్ లో కనిపించనున్నారా? ఇద్దరు కలిసి మల్టీస్టారర్ లో చేయబోతున్నారా? భారీ బడ్జెట్ తో సినిమా నిర్మాణానికి రంగం సిద్దమవుతోందా? అంటే అవుననే తెలుస్తోంది. అయితే ఈ కాంబోని కలిపే బాద్యతలు తమిళ దర్శకడు మోహన్ రాజా తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా రివీల్ చేసారు.
ప్రస్తుతం మోహన్ రాజా 'గాడ్ ఫాదర్' ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని బహిర్గతం చేసారు. నాగార్జున -అఖిల్ తో స్టైలిష్ ఎంటర్ టైనర్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే చెబుతామన్నారు. మొత్తానికి అకిల్...నాగ్ ఒకే తెరపై కనిపించడం ఖారారైందని తెలుస్తోంది.
తొలుత అక్కినేని ఫ్యామిలీ హీరోలంతా 'మనం' లో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో అఖిల్ క్లైమాక్స్ లో కనిపిస్తాడు. ఆ తర్వాత అకిల్ హీరోగా లాంచ్ అయ్యాడు. ప్రస్తుతం యంగ్ హీరోగా టాలీవుడ్ లో బిజీగా ఉన్నాడు. అటు నాగార్జున సినిమాలతో ఎప్పుడూ బిజీనే. ఇప్పటికే నాగచైతన్యతో కలిసి 'బంగార్రాజు' సినిమాలో నటించారు నాగ్.
ఈ ఏడాది ఆరంభంలో రిలీజ్ అయిన సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో అకిల్ తోనూ నాగ్ తెరను పంచుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇది పూర్తిగా స్టైలిష్ యాక్ష న్ థ్రిల్లర్ కాబట్టి..తండ్రి తనయులిద్దరు కొత్తగా చూపించడానికి అవకాశం ఉంది. స్టైలిష్ సినిమాలు చేయడంలో మోహన్ రాజా ప్రత్యేకత వేరు.
'తని ఒరువన్' తో తనలో స్టైలిష్ మేకర్ని తొలిసారి పరిచయం చేసారు. అందులో హీరో..విలన్ పాత్రలు ఎంత స్టైలిష్ గా సాగుతాయో చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా సక్సెస్ చూసే చరణ్ గాడ్ పాదర్ కి అవకాశం కల్పించారు. మరిన్ని సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అంతకంటే ముందే నాగార్జున రాజాని లాక్ చేసినట్లు కనిపిస్తుంది.
అయితే నాగ్ తో సినిమా వెనుక చిరంజీవి సలహా కూడా ఉందని లీకులందుతున్నాయి. చిరంజీవి ద్వారానే నాగార్జున.. అఖిల్ ని మోహన్ రాజా కలిసి కథ వినిపించినట్లు సమాచారం. ఆ ఇద్దరి ఇమేజ్ కి తగ్గ కథ ఇదని చిరు సజ్జెస్ట్ చేయడంతో మోహన్ రాజా కథ చెప్పినట్లు లీకులందుతున్నాయి. కారణాలు ఏవైనా? ఇంత వేగంగా అఖిల్ ..నాగ్ ని ఒకేతాటిపైకి తీసుకురావడం విశేషం. ఈ చిత్రాన్ని ఓ బడా నిర్మాణ సంస్థ నిర్మిస్తుందని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్-కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలు రంగంలోకి దిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.