వెటరన్ నటుడు మంచు మోహన్‌బాబు తాజా వ్యాఖ్యలు మా అసోసియేషన్ లో కలకలం రేపాయి. సెప్టెంబర్ లో ఎన్నికలు జరగనున్న వేళ క్రమశిక్షణా కమిటీ సభ్యుడైన మోహన్ బాబు చేసిన నర్మగర్భ వ్యాఖ్య ఎవరిని ఉద్ధేశించి చేసినది అన్నది చర్చనీయాంశంగా మారింది. వర్చువల్ పద్ధతిలో `మా` కార్యవర్గం సండే మీట్ నిర్వహించగా.. మోహన్ బాబు ఎమోషనల్ స్పీచ్ వేడి పెంచింది. ఇంతకుముందు మా సభ్యుల్లో క్రమశిక్షణా రాహిత్యానికి శిక్ష విధించాలని మెగాస్టార్ చిరంజీవి `మా` క్రమశిక్షణా కమిటీ అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖ రాయడం తెలిసినదే.
ఆయన లేఖ అనంతరం సీనియర్ నరేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నటి హేమపై చర్యలు తీసుకున్నారు. తనను వివరణ కోరుతూ ఆర్డర్ జారీ అయ్యింది. తాజా సమావేశంలో మోహన్ బాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.
``ఏం మాట్లాడాలి?.. ఎలా మాట్లాడాలో కూడా తెలియని స్థితి.. ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుంది .. యథారాజా తథా ప్రజా అని మా గురువు దాసరి గారు అన్నారు. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడేస్తున్నారు? ఎన్నెన్నో జరుగుతున్నాయి. అన్నీ చూస్తున్నాం`` అంటూ ఆవేదన వ్యక్తం చేసిన మోహన్ బాబు..అందరూ మేధావులే మేధావులకు నమస్కారం అని వ్యాఖ్యానించారు. ఆయన మాటల్లో క్షమించండి అన్న పదం ప్రతిధ్వనించింది. అది ఎందుకనో అర్థం కాని గందరగోళం నెలకొంది.
ఒకరినొకరు అనే స్థితిలో లేరు.. ఎవరికి వారు గొప్ప.. ఎస్వీఆర్ నుంచి అందరినీ చూశాను అని ఎంబీ అన్నారు. అప్పటికి ఇప్పటికి చూసుకుంటే ఎన్నో వింతలు.. విశేషాలు.. అని అన్నారు. ``జీవిత .. రాజశేఖర్ తో ప్రస్థావిస్తూ... సంస్థ అతనిది. అతను ఎందుకిలా జరిగిందని అడిగితే నేను చెప్పలేనమ్మా. `మా` అనేది అతనిది. మంచి నటుడు. అతను లేని కొరత ఉంది`` అని ఎంబీ అన్నారు. మొత్తానికి మంచు విష్ణు అధ్యక్షునిగా బరిలో ఉండగా మోహన్ బాబులో ఈ మనస్తాపం దేనికో స్పష్ఠంగా అర్థం కాలేదు. ఆయనలో ఆవేదన మాత్రం బయటపడింది. మునుముందు ఎన్నికల వేళ ఇంకా వేడి రాజుకుంటుందనే భావిస్తున్నారు.