మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న 1000 కోట్ల `మహాభారతం` చిక్కుల్లో పడిందా? అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. రైటర్ వర్సెస్ డైరెక్టర్-ప్రొడ్యూసర్ ఇష్యూ ఇది. వాస్తవానికి ఈ సినిమా ఈపాటికే ప్రారంభం కావాల్సి ఉన్నా అంతకంతకు తాత్సారం చేసేస్తుండడంతో చిర్రెత్తుకొచ్చిన రైటర్ తన స్క్రిప్టు తనకు ఇచ్చేయాల్సిందిగా అల్టిమేటమ్ జారీ చేశారు. దీంతో ఈ ఇష్యూ జాతీయ స్థాయిలో హాట్ డిబేట్ గా మారింది.
వాస్తవానికి `మహాభారతం` చిత్రం తెరకెక్కిస్తున్నామని - అందుకోసం దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త 1000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారని మోహన్ లాల్ అప్పట్లో స్వయంగా ప్రకటించారు. శ్రీకుమార్ మేనన్ దర్శకత్వం వహిస్తారని తెలిపారు. ఈ సినిమా భీముడి కోణంలో ఉంటుంది. భీముడిని ప్రధాన పాత్రగా చూపిస్తూ ఇతర పాత్రల్ని చూపించేలా.. కథ ఉంటుంది. అందుకోసం ప్రముఖ రచయిత ఎంటి వాసుదేవన్ నాయర్ రచించిన `రాందమూళం` అనే నవల హక్కుల్ని తీసుకున్నామని తెలిపారు. కానీ ఇంతకీ ఎంతకీ ఈ సినిమా పట్టాలెక్కకపోవడంతో రచయితకు ఆగ్రహం కలిగించింది.
స్క్రిప్ట్ తీసుకునేప్పుడు మూడేళ్లలో సినిమాను తెరకెక్కిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నా నాలుగేళ్లవుతోంది. ఇంకా తికాణా లేదు. అసలింతకీ మొదలు పెడతారా .. లేదా? అంటూ రచయిత వాసుదేవన్ సీరియస్ అయ్యారు. ఏం జరుగుతోందో పట్టించుకోకపోవడం నా తప్పే. త్వరలో లాల్‌ని కలిసి పరిస్థితి ఏంటో తెలుసుకుంటానని - ప్రారంభించలేకపోతే తన స్క్రిప్ట్ వెనక్కి ఇచ్చేయమని డిమాండ్ చేస్తూ ఫేస్ బుక్ లో కామెంట్ ని పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో మోహన్ లాల్ భీముడి పాత్రలో నటించాలనుకున్నారు. అలానే టాలీవుడ్ కింగ్ నాగార్జున కర్ణుడిగా నటిస్తారని అప్పట్లో ప్రచారమైంది. మొత్తానికి ఈ సినిమా విషయంలో ఏం జరుగుతోందో ఎవరికీ తెలీని పరిస్థితి. అయితే 1000 కోట్లు సమకూరుస్తానని ప్రకటించిన దుబాయ్ వ్యాపారవేత్త ఆర్థికపరమైన చిక్కులు ఎదుర్కోవడం వల్లనే ఇలా అవుతోందన్న మాటా వినిపిస్తోంది.