చాలా ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ కి షాక్‌

Update: 2022-10-24 05:30 GMT
మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్ వయసు పెరిగినా కొద్ది తన మార్కెట్ విలువ పెంచుకుంటూ వస్తున్నాడు. మలయాళ సినీ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన పదుల కొద్ద సినిమాలు ఈయన జాబితాలో ఉన్నాయి అనడంలో సందేహం లేదు. గడచిన కొన్ని సంవత్సరాలుగా ఈయన బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూనే ఉన్నాడు.

కరోనా సమయంలో విడుదల అయిన సినిమాలు కూడా ఒక మోస్తరుగా వసూళ్లను రాబట్టాయి. మలయాళంలో మోహన్ లాల్‌ స్థాయిని ఇప్పట్లోనే కాదు ఎప్పటికి ఎవరు అందుకోలేరు అంటూ అంతా అనుకుంటున్న సమయంలో మాన్ స్టర్ సినిమా తో బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాడు.

మోహన్ లాల్‌ తాజా చిత్రం మాన్‌ స్టర్ దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని.. వంద కోట్ల వసూళ్లు నమోదు చేస్తుందని అభిమానులతో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు బలంగా నమ్మారు.

కానీ ఈ మధ్య కాలంలో మోహన్ లాల్‌ అతి తక్కువ ఓపెనింగ్స్ దక్కించుకున్న సినిమాగా ఈ సినిమా నిలవడం విచారకరం.

ఓటీటీ లో మంచి విజయాలను సొంతం చేసుకుంటూ మాన్‌ స్టర్ తో థియేట్రికల్‌ ఇండస్ట్రీ హిట్ ను కొట్టడం ఖాయం అని అంతా భావించారు. పులి మురుగన్ సినిమా తో మోహన్ లాల్‌ కి భారీ విజయాన్ని అందించిన దర్శకుడు వైశాఖ్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందిన విషయం తెల్సిందే.

వైశాఖ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ విభిన్నమైన యాక్షన్‌ అడ్వంచర్ క్రైమ్‌ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చింది. మోహన్‌ లాల్‌ ఈ మధ్య కాలంలో థియేట్రికల్‌ రిలీజ్ తో రాకపోవడం వల్ల ఈ సినిమాను జనాలు పట్టించుకోవడం లేదా.. లేదంటే మోహన్‌ లాల్ క్రేజ్ తగ్గిందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News