మలయాళ సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్

Update: 2016-10-27 13:30 GMT
సౌత్ ఇండియాలో తెలుగు.. తమిళ ఇండస్ట్రీల స్థాయే వేరు. కన్నడ.. మలయాళ సినిమాల పరిధి తక్కువ. మలయాళ ఇండస్ట్రీ ప్రోగ్రెసివ్ గానే ఉంటుంది కానీ.. వాళ్ల మార్కెట్ పరిధి తక్కువ. చిన్న రాష్ట్రం కావడంతో కలెక్షన్లు కూడా దానికి తగ్గట్లే ఉంటాయి. ఓపక్క తమిళ.. తెలుగు సినిమాలు వంద కోట్ల గ్రాస్ మార్కును ఈజీగా టచ్ చేస్తుంటే మలయాళ సినిమాకు మాత్రం అది అసాధ్యం లాగా కనిపించింది ఇన్నాళ్లూ. రెండు మూడేళ్ల కిందటి వరకు వాళ్లకు రూ.50 కోట్ల గ్రాస్ మార్కుకు కూడా గొప్ప ఘనతగా ఉండేది. కానీ ఈ మధ్య వాళ్ల సినిమాల పరిధి పెరిగింది. ఈ విషయంలో ప్రధాన ఘనత మోహన్ లాల్ దే. ఆయన ‘దృశ్యం’ సినిమానే మలయాళంలో ఫస్ట్ 50 కోట్ల మూవీ.

ఐతే ఇప్పుడు మలయాళంలో తొలి రూ.100 కోట్ల గ్రాస్ మూవీ అందించిన ఘనత కూడా మోహన్ లాల్ దే అయింది. ఆయన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘పులి మురుగన్’ రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. మూడు వారాల కిందట విడుదలైన ఈ సినిమాకు తొలి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. అత్యంత వేగంగా రూ.20 కోట్లు.. రూ.50 కోట్ల మార్కును అందుకున్న మలయాళ సినిమాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం రేపింది. ఈ చిత్రాన్ని ‘మన్యం పులి’ పేరుతో తెలుగులోకి కూడా అనువాదం చేస్తుండటం విశేసం. మనమంతా.. జనతా గ్యారేజ్ సినిమాలతో ఇటీవల తెలుగులో మోహన్ లాల్ కు మంచి ఫాలోయింగే వచ్చింది. పైగా జగపతిబాబు.. కమలిని ముఖర్జీ లాంటి వాళ్లు నటించడం కూడా ఈ సినిమాకు కలిసొచ్చేదే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News