బయోపిక్ ల సీజన్ ఇది. వరుస బయోపిక్ లతో అన్ని ఇండస్ట్రీలు హోరెత్తిపోతున్నాయ్. చరిత్రలో - పురాణాల్లో దాగి ఉన్న ప్రముఖుల జీవితకథల్ని తవ్వి తీస్తున్నారు. ఈ తవ్వకాల్లో ఎన్నో అద్భుతమైన కథలు బయటపడుతున్నాయ్. ఇన్నాళ్లు కథలు దొరకడం లేదు అన్నవాళ్లకు ఎంతో ఈజీగా ప్రముఖుల క్యాచీ లైఫ్ పై కథలు రాసుకోవడం కుదురుతోంది. అదంతా అటుంచితే ఆసియాలోనే అతి భారీ బడ్జెట్ సినిమా లాంచ్ అయ్యింది. నిన్నటిరోజున చంద్రగ్రహణం వేళ.. గురుపౌర్ణమి వేళ ఎంతో సెంటిమెంటుగా `రంధమూజమ్` ప్రారంభమైంది. ఈ విషయాన్ని లెజెండ్ మోహన్ లాల్ అధికారికంగా తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. దీనికి దుబాయ్ కి చెందిన బిజినెస్ టైకూన్ బి.ఆర్.శెట్టి పెట్టుబడులు సమకూరుస్తున్నారు.
వాస్తవానికి గత వేసవిలోనే ఈ సినిమా ప్రారంభిస్తామని లాల్ ప్రకటించారు. అయితే ఇప్పటివరకూ ఆయన వేరే కమిట్ మెంట్లతో బిజీగా ఉన్నారు. ఇప్పటికి ముహూర్తం కుదిరింది. రంధమూలం మొదలైంది అన్న ప్రకటన వెలువడిన అనంతరం లాల్ కి ఇబ్బడిముబ్బడిగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మలయాళ చిత్ర పరిశ్రమ ప్రముఖులంతా లాల్ కి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి? అంటే.. మహాభారతంలో భీముడి పార్ట్ ఆధారంగా `రండమూజమ్` నవల రాశారు ప్రఖ్యాత రచయిత ఎం.టి వాసుదేవన్ నాయిర్. ఆ నవల ఆధారంగానే ఈ సినిమా తీస్తున్నారు. అంటే ఇది భీముడి బయోపిక్ అని కన్ఫామ్ గా చెప్పొచ్చు. భీముడిలాంటి మోహన్ లాల్ ఈ సినిమాకి పెద్ద అస్సెట్ అనడంలో సందేహం లేదు. ఇకపోతే ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లాల్ సర్ ఓడియన్ అనే మరో ఫాంటసీ&ఫిక్షన్ చిత్రంలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే.