పెష్వాల్ని అవ‌మానించావ్ భ‌న్సాలీ

Update: 2015-11-19 11:30 GMT
సంజ‌య్‌ లీలా భన్సాలీ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న సినిమా భాజీరావ్ మ‌స్తానీ. ఈ మూవీలో భాజీరావ్ క్యారెక్ట‌ర్‌ లో ర‌ణవీర్ సింగ్ న‌టిస్తున్నాడు.  అత‌డి భార్య‌లు కాశీభాయ్‌ - మ‌స్తానీ లుగా ప్రియాంక చోప్రా - దీపిక‌ప‌దుకొన్ న‌టిస్తున్న సంగ‌తితెలిసిందే. ఇటీవ‌లే ఈ భామ‌లిద్ద‌రి న‌ర్త‌న‌ల‌తో పింగా.. సాంగ్‌ని ఆన్‌ లైన్‌ లో రిలీజ్ చేశారు.

కాశీభాయ్ - మ‌స్తానీ గెట‌ప్పులు - డ్యాన్సులు సెన్సేష‌న్ అయ్యాయి. అయితే సెన్సేష‌న్‌ తో పాటు వివాదం కూడా ఫేస్ చేయాల్సొస్తోంది ఇప్పుడు. భ‌న్సాలీ ఫెష్వా రాజుల్ని - రాణుల్ని అవ‌మానిస్తున్నాడంటూ మోహిని క‌ర్కారే అనే మ్యాడ‌మ్‌ ఏకంగా ఓ బ‌హిరంగ లేఖ రాశారు. చ‌రిత్ర తెలియ‌కుండా సినిమా ఎలా తీస్తున్నావ్‌? అంటూ అత‌డు ఘాటైన లేఖ రాసుకొచ్చారు. అస‌లు హిస్ట‌రీ గురించి, పెష్వాల గురించి నీకేం తెలుసు? అంటూ భ‌న్సాలీని నిలదీసింది.

అస‌లు పెష్వాల క‌ల్చ‌ర్‌ లో ఆడాళ్లు డ్యాన్సులు వేయ‌డం - గెంత‌డం అనేదే లేదు. అందుచేత వీళ్లెవ‌రూ డ్యాన్సులాడ‌రు. కానీ పింగా అంటూ అన‌వ‌స‌ర డ్యాన్సులు చేయించారు. అయినా కాశీభాయి టీబీ రోగి - పైగా అర్థ్ర‌యిటిస్‌ తో బాధ‌పడ్డారు. అలాంటి వ‌నిత డ్యాన్స్‌ ఫ్లోర్‌ పై అన్ని మూవ్‌ మెంట్స్ ఎలా ఇస్తుంది గురూ? అయినా చ‌రిత్ర‌ను చ‌ద‌వ‌కుండా - పెష్వాల గురించి తెలుసుకోకుండా ఇలా ఎందుకు సినిమా తీస్తున్నావ్‌? అంటూ సుదీర్ఘంగా 40 పాయింట్ల‌తో కూడిన లేఖ ఒక‌టి రాసారు మోహిని.

అస‌లు పింగా పాట‌లో ధ‌రించిన భారీ కాస్ట్యూమ్స్ పెష్వా రాణులు ఎప్పుడూ ధ‌రించ‌లేదు. పావు స్కిన్ షో కూడా చేసిందే లేదు మీరు చూపించిన‌ట్టు. ఆ మాట కొస్తే అసలు మ‌స్తానీ రాజావారి ఆస్థానంలో డ్యాన్స‌ర్ కానేకాదు. త‌ను రాజా ఛ‌త్ర‌సాల్‌ కి కుమార్తె. భాజీరావుకి రెండో భార్య అయ్యింది. భాజీరావు మ‌హారాష్ర్టీయుల్లో ఛ‌త్ర‌ప‌తి శివాజీ త‌ర్వాత అంత‌టివాడు. ఇప్పుడు మీరు మొత్తం మ‌హారాష్ర్ట‌లో ఉన్న ఫ్యామిలీల‌ను అవ‌మానించారు.. అంటూ మోహిని బ‌హిరంగ లేఖ‌లో తూర్పార‌బ‌ట్టారు.
Tags:    

Similar News