స్టార్ హోదా కంటే.. మాతృత్వమే గొప్ప: అలియా భట్

Update: 2023-01-02 03:52 GMT
బ్యూటిఫుల్ బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ గత రెండు మూడేళ్ల కాలంలోనే తన స్టార్ ఇమేజ్ ను అమాంతంగా పెంచేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ లలో ఆమె ఒకరు. అయితే అలాంటి హీరోయిన్ ఇటీవల పెళ్లి చేసుకోవడమే కాకుండా వెంటనే మళ్ళీ తల్లి కావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

అంతేకాకుండా బాలీవుడ్ మీడియాలో కూడా ఆమెకు సంబంధించిన అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. స్టార్ ఇమేజ్ ఇంత హై లెవెల్ లో ఉన్న తర్వాత కూడా ఇంత త్వరగా పెళ్లి చేసుకొని పిల్లలను కనడానికి సిద్ధమైంది అని అయితే హీరోయిన్ గా ఆమె కెరీర్ పై ప్రభావం పడే అవకాశం ఉంది అనే విధంగా కూడా కామెంట్స్ అయితే వినిపించాయి.

ఆలియా భట్ ఆ కామెంట్స్ పై తనదైన శైలిలో ఒక సమాధానం అయితే ఇచ్చింది. తల్లి కావడం అనేది ఒక గొప్ప అదృష్టమే అలాంటి అద్భుతమైన అవకాశాన్ని నేను తొందరగా పొందినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇక ఇంత స్టార్ హోదా ఉన్న సమయంలో త్వరగా పిల్లలను కంటే స్టార్ హోదా పోతుంది అనేది నేను ఎంత మాత్రమూ నమ్మలేను. మన వ్యక్తిగత జీవితానికి సినిమా జీవితానికి ఏ సంబంధం లేదు.

ఒకవేళ అలాంటి సంబంధమే ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే ఇది నేను ఎంతో ఇష్టంగా అనుకున్న ఒక మంచి తరుణం. మా ఫ్యామిలీ లైఫ్ లో మరొక మెంబర్ చేరుతున్నారు అంటే మాకు ఎంతో సంతోషకరమైన విషయం. కాబట్టి ఆ ఆనందాన్ని మనస్పూర్తిగా ఆస్వాదిస్తున్నాము.

అంతేగాని సినిమా కెరీర్ గురించి మాత్రం ఎంత మాత్రం మేము టెన్షన్ పెట్టుకోలేదు.. అని అలియా భట్ తన మాతృత్వపు ప్రేమను ఎంతో ఆనందంగా వివరణ ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ మూడు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక త్వరలోనే ఆమె మరో ఫ్యాన్ ఇండియా హీరోతో కూడా సినిమా చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News