మొత్తానికి అఖిల్ గట్టున పడ్డాడు .. ఓటమి బారి నుంచి తప్పించుకుని ఒడ్డున పడ్డాడు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'తో ఫస్టు హిట్ కొట్టాడు. అఖిల్ హీరోగా తన కెరియర్ ను మొదలుపెట్టేసి చాలాకాలమే అయింది. అయితే ఏ సినిమా కూడా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించినా .. కథలను విదేశాల్లో పరుగులు తీయించినా అవి హిట్టు గుట్టును వెతికి పట్టలేకపోయాయి. దాంతో అఖిల్ మాత్రమే కాదు, ఆయన అభిమానులు కూడా డీలాపడిపోయారు. అలాంటి పరిస్థితుల్లోనే ఆయన 'బొమ్మరిల్లు' సినిమాను అంగీకరించాడు.
అయితే అఖిల్ అప్పటి వరకూ చేస్తూ వచ్చిన కథల దారిలోనే ఇదీ ఉంటుందని అంతా అనుకున్నారు. అందువలన ఒక రేంజ్ కుతూహలమైతే చూపించలేదు. ఇక 'బొమ్మరిల్లు' భాస్కర్ కి ఆ సినిమా తరువాత ఆ స్థాయి హిట్ పడలేదు. అందువలన ఆ వైపు నుంచి కూడా ప్రేక్షకులు ఆశాజనకంగా లేరు. ఇక ఉన్నదల్లా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై గల నమ్మకం .. పూజ హెగ్డేకి గల ఫాలోయింగ్ .. అంతే. కథలో కొత్త విషయమేదైనా ఉంటేనే గీతా ఆర్ట్స్ వారు ఓకే చేస్తారు .. లేదంటే లేదు. అందువల్లనే ప్రేక్షకులకు కాస్త నమ్మకం పెట్టుకుని థియేటర్లకు వెళ్లారు.
ఈ సినిమాకి ఒక రేంజ్ లో చేసిన ప్రమోషన్స్ బాగానే కలిసొచ్చాయి. అలాగే థియేటర్ల వైపు నుంచి కూడా పరిస్థితులు అనుకూలంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో విడుదలైన ఈ సినిమా, తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. తొలి రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 18 కోట్లను రాబట్టింది. అన్ని ఏరియాల్లో కలుపుకుని ఈ సినిమా 18 కోట్ల రేషియోలో బిజినెస్ జరిగితే, అందులో నుంచి దాదాపు 22 కోట్ల షేర్ వచ్చింది. దాంతో ఈ సినిమాకి థియేటర్ల వైపు నుంచి 4 కోట్ల లాభం వచ్చింది. యూత్ ఫుల్ లవ్ స్టోరీ కావడం .. పాటలు బాగుండటం .. పండుగ సీజన్లో రిలీజ్ కావడం ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి.
ఇక ఈ సినిమాతో పాటు విడుదలైన 'పెళ్లి సందD' అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా ఫ్లాప్ అనే టాక్ వచ్చింది కానీ, కొంతవరకూ లాభాలను రాబట్టినట్టుగా సమాచారం. కథాకథనాల్లో కొత్తదనం లేకపోవడం .. పాత 'పెళ్లి సందడి' ప్రభావం నుంచి బయటపడలేకపోవడం .. హీరో హీరోయిన్ చుట్టూ బలమైన పాత్రలు లేకపోవడం ప్రేక్షకులకు కొంత అసంతృప్తిని కలిగించాయనే టాక్ వచ్చింది. అయినా చాలా రోజులుగా థియేటర్లకు దూరంగా ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ రావడం వలన పరిస్థితి అనుకూలంగా మారింది. అందుకే ఫ్లాప్ టాక్ .. హిట్ కలెక్షన్స్ అంటూ ఈ సినిమాను గురించి చెప్పుకుంటున్నారు.