ఎస్.ఎస్.రాజమౌళి స్టాంపు ఉన్న సినిమాతో, ఎం.ఎం.కీరవాణి ట్యూన్లు కట్టిన సినిమాతో గాయనిగా ఆరంగేట్రం చేయడం అంటే ఆషామాషీనా? కానీ అలాంటి అరుదైన అవకాశం ఈ అక్కా చెల్లెళ్లకు వచ్చింది. హైదరాబాదీ అమ్మాయిలు, అక్కాచెల్లెళ్లు మౌనిమ భట్ల, ధామిని భట్ల బాహుబలి సినిమాలో పాడే అవకాశం అందుకున్నందుకు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇది ఎంతో అదృష్టం ఉంటే కానీ రాని అవకాశమని అంటున్నారు. ఇటీవలి కాలంలో ఎఫ్‌ఎం రేడియోల్లో ఎక్కువగా వినిపిస్తున్న ఓ రెండు పాటలు ఈ ఇద్దరూ పాడినవే.. శివుని ఆన, పచ్చ బొట్టాసి పాటల్ని ఈ వర్ధమాన గాయనీమణులు ఆలపించారు.
అయితే ఈ ఇద్దరూ ఎలా ఎంపికయ్యారు? సంగీత దర్శకుడు కీరవాణికి ఎలా పరిచయమయ్యారు? అని ఆరాతీస్తే తెలిసిన ఆసక్తికర సంగతులివి. మేనిమ తొలుత తను పాడిన పాటల రికార్డింగుల్ని కీరవాణికి పంపించింది. ఆ తర్వాత ప్రసాద్ లాబ్స్‌లో ఆడిషన్స్‌లో పాల్గొని శివుని ఆన పాడేందుకు ఎంపికైంది. అలా బాహుబలిలో పాట పాడే ఛాన్సొచ్చింది. అలాగే ధామినిని ఓ సింగింగ్ రియాలిటీ షోలో చూసి కీరవాణి ఎంపిక చేసుకున్నారు. గత ఏడాది సెప్లెంబర్ నుంచి కలిసే పనిచేస్తున్నారు. నవతరం గాయనీమణులకు బోలెడంత భవిష్యత్ ఉండాలని కోరుకుందాం.