మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో సిత్రవిసిత్రాలు బయటపడుతున్నాయి. ప్రకాష్ రాజ్ ఇంతకుముందే `సినిమా బిడ్డలు` పేరుతో తన ప్యానెల్ సభ్యులను ప్రకటించారు. ఆసక్తికరంగా అధ్యక్ష పదవికి పోటీపడాల్సిన జీవిత.. హేమ వంటివారి మనసు మార్చి ప్రకాష్ రాజ్ తనవైపు తిప్పేసుకోవడంలో సఫలమయ్యారు. అయితే ఆ ఇద్దరూ ఇటువైపు టర్న్ అవ్వడం వెనక మెగా మంత్రాంగం సాగిందని కథనాలొస్తున్నాయి.
ప్యానెల్ ని ప్రకటించిన ప్రకాష్ రాజ్ తన దూకుడును కొనసాగిస్తున్నారు. ఇక ప్రకాష్ రాజ్ కి ధీటుగా పోటీపడేందుకు మంచు విష్ణు తనవైన సన్నాహకాల్లో తాను ఉన్నారు. ఇప్పటికే అతడు తన వర్గంతో ఎన్నికల్లో హోరాహోరీకి సిద్ధమవుతున్నారని తెలిసింది.
ఇంతలోనే ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున పోటీ చేస్తారని భావించిన నటుడు కం నిర్మాత బండ్ల గణేష్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారని కథనాలు వస్తున్నాయి. తాజాగా ఆయన ప్రకాష్ రాజ్ ని ఉద్ధేశించి చేసిన ట్వీట్ ఆసక్తిగా మారింది. ``గౌరవనీయులైన ప్రకాష్ రాజ్ గారు.. నన్ను అధికార ప్రతినిధిగా ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. అయితే నా వ్యక్తిగత కారణాల వల్ల ఆ పదవిని నేను నిర్వర్తించలేను. దానికి న్యాయం చేయలేను. దయచేసి ఆ పదవికి వేరే వ్యక్తిని ఎంచుకోగలరు. మీ టీమ్ కు ఆల్ ది బెస్ట్. మీ బండ్ల గణేష్`` అంటూ బండ్ల ట్వీట్ చేశారు.
అయితే బండ్ల ఇలా నిరాశపడడం వెనక కారణమేమిటి? అన్నది ఆరా తీస్తే... ఇంతకుముందు ప్రకటించిన ప్యానెల్ లో ఆయన పేరు లేకపోవడమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. తమ ప్యానల్ తరపున ప్రతినిధులుగా జయసుధ- బండ్ల గణేశ్- సాయికుమార్ మాత్రమే మాట్లాడతారని తెలిపిన ప్రకాష్ రాజ్ .. అనూహ్యంగా బండ్లను ప్యానెల్ నుంచి తప్పించడంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంతకుముందు ప్రకటించిన ప్యానెల్ లో ఎక్కడా బండ్ల పేరు కనిపించకపోవడమే ఈ లొల్లికి కారణమని గుసగుస వినిపిస్తోంది. కనీసం ఈసీ సభ్యుల్లోనూ ఆయన పేరు లేకపోవడం మనస్థాపానికి కారణమైందిట.
నిజానికి ప్రకాష్ రాజ్ ని అధ్యక్ష పదవికి పోటీ పడాల్సిందిగా సమర్థించిన వారిలో బండ్ల గణేష్ ఒకరు. మెగా అండదండలున్న ప్రకాష్ రాజ్ పై నాన్ లోకల్ ఇష్యూ వచ్చినప్పుడు ఆయనకు అండగా నిలిచింది బండ్ల. కానీ ఎందుకనో ఆ ఇద్దరి మధ్యా మనస్ఫర్థలు వచ్చాయని గుసగుస వినిపిస్తోంది. మరోవైపు బండ్ల గణేష్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతోంది. అది కూడా ఆయన ఎగ్జిట్ కి ఒక కారణం అయి ఉండొచ్చని కథనాలొస్తున్నాయి.
ఆసక్తికర మలుపుల అనంతరం బండ్ల ఈసారి సెక్రటరీగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నాని ప్రకటించడం మరో ట్విస్టు. బండ్ల గణేష్ చేసిన తాజా ట్వీట్ హీటెక్కిస్తోంది. ``మనస్సాక్షికి ఎంతచెప్పినా మాట వినడం లేదు. నన్ను పోటీ చెయ్ అంటోంది. అందుకే ఈ పోటీ. అందరికీ అవకాశం ఇచ్చారు… ఒకే ఒక అవకాశం నాకివ్వండి. నేనేంటో చూపిస్తా…`` అంటూ బండ్ల తన సందేశాన్ని తెలియజేసారు. అయితే ఇంతకుముందే డ్రగ్స్ విషయమై మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో స్పందిస్తూ సంచలన వ్యాఖ్య చేశారు. డ్రగ్స్ పుచ్చుకునేవాళ్లు దేశద్రోహులు అని అన్నారు. ఇకపోతే పూరీ జగన్నాథ్ ని డ్రగ్స్ కేసులో ఈడీ విచారించేప్పుడు బండ్ల అక్కడికి హుటాహుటీన వెళ్లడం తెలిసిందే. ఈ కొద్ది గ్యాప్ లోనే ప్రకాష్ రాజ్ తో విభేధాలు తలెత్తడంపైనా `మా` మెంబర్లలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంతకీ ప్రకాష్ రాజ్ తో ఎక్కడ చెడిందో బండ్ల స్వయంగా వివరణ ఇస్తారేమో చూడాలి.