ఇండస్ట్రీతో పాటు అనేక రంగాల్లో ఒకరి క్రియేటివిటీని మరొకరు కొన్నిదశాబ్దాలుగా క్యాష్ చేసుకుంటూ ప్రపంచం ముందు విజేతలుగా క్రియేటర్స్ గా నిలుస్తున్నారు. ఈ తంతు సినీ ఇండస్ట్రీలో మరీ ఎక్కువగా కనిపిస్తూ వస్తోంది. చాలా మంది రైటర్లకు, డైరెక్టర్లకు ఘోస్ట్ రైటర్లుగానూ వర్క్ చేస్తూ డబ్బులు ఇస్తాం.. కానీ పేరు ఇవ్వం.. ఆ స్థానంలో మా పేరు వేసుకుంటామంటూ ఓ పెన్ గానే కొంత మంది క్రియేటర్లని వాడుకుంటున్నారు. డబ్బు అవసరం కాబట్టి చేసేది లేక చాలా మంది రైటర్లు ఘోస్ట్ రైటర్లుగా ఎంతో మంది స్టార్ డైరెక్టర్లు, స్టార్ రైటర్లకు పని చేస్తూ చీకట్లోనే మిగిలిపోతున్నారు.
కొంత మంది ఆ చీకట్లోంచి బయటికి వచ్చి దర్శకులుగా మారుతుంటే మరి కొంత మంది ఇప్పటికీ చికట్లోనే వుంటూ పలువురు స్టార్ డైరెక్టర్లకు కీలకంగా నిలుస్తూ వారి ఎదుగుదలకు పరోక్షంగా కారణం అవుతున్నారు. గంతంలో `సింహా` మూవీకి కథని కొరటాల శివ అందిస్తే డబ్బులు ఇచ్చేశాక ఆ కథ నాదే అందుకే నా పేరే వేసుకుంటానని స్టార్ డైరెక్టర్ అనిపించుకున్న బోయపాటి శ్రీను బాహాటంగానే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పడు కొంత మంది స్టార్ డైరెక్టర్లు ఏడీలని అడ్డంపెట్టుకుని బండి లాగించేస్తున్నారట.
ఇదే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. సెట్ లో ఇప్పటికీ పూర్తి స్థాయి ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తో అడుగుపెట్టని స్టార్ డైరెక్టర్లున్నారంటే ఎవరూ నమ్మరు కానీ ఇది పచ్చినజం అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కొంత మంది దర్శకులు సెట్ లో సీన్ లు రాస్తూ వుంటారని చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. దాని వల్లే సినిమాల ఫలితాలు తారుమారవుతున్నాయని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించిన విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే సెట్ లో స్క్రిప్ట్ ఇంప్రువైజేషన్ అంతా ఏడీలదే అని చెబుతున్నారు. చాలా వరకు ఇంగ్లీష్, హిందీపై తో పాటు రచనా శైలిలో మంచి పట్టున్న వారినే పక్కన పెట్టుకుంటూ స్టార్ డైరెక్టర్లు వారి చేతే కీలక ఘట్టాల ఇంప్రువైజేషన్స్ చేయిస్తుంటారట. డైరెక్టర్ వద్ద మంచి మార్కులు పడాలన్న ఉద్దేశ్యంతో చాలా మంది ఏడీలు చేసేది లేక బెస్ట్ సీన్ లని రాస్తుంటారట. అలా రాసిన సీన్ లతో బెస్ట్ అనిపించుకుంటూ స్టార్ డైరెక్టర్స్ బండి లాగించేస్తున్నారనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
ఇక ఓ స్టార్ డైరెక్టర్ అయితే హాలీవుడ్ సినిమాల కోసం పది మంది టీమ్ ని పెట్టుకుని మరీ ప్రతీ మూవీలోని బెస్ట్ సీన్ లని ఏడీల ద్వారా పిక్ చేయించి ఆ సీన్ లని తెలుగు నేటివిటీకి అనుగుణంగా వారి చేతే మార్పించేసి ఫైనల్ గా ఓ స్క్రిప్ట్ ని రెడీ చేయించడం, అలా రెడీ చేయించిన స్క్రిప్ట్ లతో సినిమాలు చేయడం.. అవి అన్నీ కుదిరితే బ్లాక్ బస్టర్ లు కావడం మిస్ ఫైర్ అయితే భారీ డిజాస్టర్ లు గా మారడం జరుగుతోందని, గత కొంత కాలంగా ఏడీల క్రియేటివిటీతో కొంత మంది దర్శకులు బండి లాగించేస్తున్నారని కామెంట్ లు వినిపిస్తున్నాయి.