అసలే భారీ గ్యాప్ తర్వాత చేసిన సినిమా.. రకుల్ ఎందుకిలా చేస్తోంది..??

Update: 2021-02-26 03:30 GMT
యువహీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే కొన్నేళ్ల కిందట ఆమె స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. కానీ ఇప్పుడు అమ్మడికి అవకాశాలు దొరకడమే గగనం అయిపోయింది. ఆదిగాక రకుల్ తెలుగులో చేసిన చివరి సినిమా మన్మధుడు-2. 2019లో విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. అయితే దాదాపు రెండేళ్లు గ్యాప్ తర్వాత యువహీరో నితిన్ తో ‘చెక్’ సినిమాలో నటించింది. ప్రస్తుతం విడుదలకు తక్కువ టైం ఉండటంతో చిత్రబృందం సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు వేగంగా జరుపుతోంది. అయితే ఈ సినిమాలో నితిన్ సరసన ప్రియాప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో రకుల్ లాయర్ పాత్రలో నటించినట్లు తెలుస్తుంది.

అయితే ఈమధ్య చెక్ మూవీ బృందం జరిపిన ఏ కార్యక్రమానికి కూడా రకుల్ హాజరుకాలేదు. ముంబైలో షూటింగ్‌తో బిజీగా ఉందని సమాచారం అందించిందని టాక్. కానీ మన్మధుడు-2 తర్వాత రకుల్ నుండి విడుదల అవుతున్న ఫస్ట్ సినిమా ఇది. అలాంటి ఇంపార్టెంట్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రకుల్ లేకపోవడం సోషల్ మీడియాలో చర్చలకు దారితీస్తోంది. రకుల్ హాజరు కాకపోవడంతో తెలుగు అభిమానులలో కూడా సందేహాలు మొదలవుతున్నాయి. సరే ప్రీరిలీజ్ కు రాలేదు.. మరి నెక్స్ట్ ప్రెస్ మీట్, టీవీ ప్రోగ్రాంస్ ఇలా దేనికి కూడా రకుల్ రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంత ఇంపార్టెంట్ సినిమాకోసం ఒకరోజు అయినా కుదరట్లేదా అంటూ ప్రశ్నలు బహిర్గతం అవుతున్నాయి. అమ్మడికి బాలీవుడ్, కోలీవుడ్ లో వరుస సినిమాలు చేతిలో ఉన్నాయి. అందుకే ఈ సినిమాను లైట్ తీసుకుందేమో అని ఇండస్ట్రీ వర్గాలలో టాక్. చూడాలి మరి రకుల్ ఇప్పటికైనా స్పందిస్తుందేమో!
Tags:    

Similar News