ఓ మూడేళ్ళ వెనక ట్రెండ్ తో పోలిస్తే టెక్నాలజీ వాడకంలో విపరీతమైన మార్పులు వచ్చిన మాట వాస్తవం. ప్రతి ఒక్కరి చేతిలో ఫోర్ జీ స్మార్ట్ ఫోన్ వచ్చేసి రోజుకో జిబి డేటా ఉచితంగా అందుబాటులోకి రావడంతో ముఖ్యంగా ఎంటర్ టైన్మెంట్ రంగంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. చిన్న చిన్న టీజర్లు సైతం మిలియన్ల వ్యూస్ దక్కించుకుంటున్నాయి అంటే అది దీని మహత్యమే.
మరోవైపు కొత్త సినిమాల విడుదల రోజున సోషల్ మీడియాలో దానికి సంబందించిన రివ్యూలు రిపోర్టులు అభిప్రాయాలు ఇలా పేర్లు ఏవైనా వాటి గురించి చర్చలు కూడా తీవ్ర స్థాయిలో ఉంటున్నాయి. మొదటి షో పూర్తవ్వడం ఆలస్యం దాని గురించి చెప్పేవాళ్లు విపరీతంగా పెరిగిపోతున్నారు. ఇక ఆన్ లైన్ మీడియా సైతం అందరికంటే ముందే సమాచారాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో పోటీ వల్ల పరుగులు పెడుతున్నాయి
ఇటీవలి కాలం డిజాస్టర్లు లేదా యావరేజ్ సినిమాలకు కనీస కలెక్షన్లు రాకపోవడానికి కారణం ఈ సోషల్ మీడియా ధోరణులే అని కొందరు నిర్మాతలు వాపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వాస్తవంగా ఆలోచిస్తే రీచ్ లక్షల్లోనే ఉండే ఫేస్ బుక్ ఇన్ స్టాగ్రామ్ ట్విట్టర్ లాంటి వాటికి కోట్లాది మందిని ప్రభావితం చేసే ఛాన్స్ ఉందా అంటే మరీ అంత లేదనే చెప్పాలి. ఎందుకంటే వీటిద్వారా తమ ఫీలింగ్స్ ని చెబుతోంది సామాన్యులు. అంతే తప్ప మిలియన్ల ఫాలోయర్స్ ఉన్న సెలబ్రిటీలు కారు.
తమ తోటి కళాకారులు నటించిన సినిమాల గురించి నెగటివ్ గా ఏ ఒక్క నటుడు నటి పొరపాటున కూడా ప్రచారం చేయరు. అలాంటిది కేవలం ఆన్ లైన్ లో సామాన్య పబ్లిక్ నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయాలను బట్టి వసూళ్లు తగ్గుతున్నాయి ఫలానా హీరో ఇమేజ్ ని డౌన్ చేస్తున్నారు అని చెప్పడంలో లాజిక్ లేదు.
కంటెంట్ నిజంగా ఉంటే ఓ మాములు కమెడియన్ హీరోగా నటించిన సినిమా కూడా హిట్ అవుతుంది. తేడా ఉంటే వంద కోట్ల మార్కెట్ ఉన్న హీరోకైనా మొదటి రోజు సాయంత్రం షోకే తిరస్కారం తప్పడం లేదు. కాబట్టి ఇలాంటి ట్రెండ్స్ వల్ల హీరోనో సినిమానో చెడగొట్టడం జరగని పని. వాటి గురించి ఆలోచించే బదులు ఎక్కువ శాతం జనం మెచ్చేలా స్క్రిప్ట్స్ రాయడం మీద ఫోకస్ పెడితే బెటర్