ప్రపంచ సినీ చరిత్రలో జేమ్స్ బాండ్ మూవీస్ కు ఉన్న ఆదరణ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాక్షన్ సినిమా అంటే 'జేమ్స్ బాండ్' మూవీనే అన్నంతంగా క్రేజ్ దక్కించున్నాయి ఈ చిత్రాలు. అయితే.. జేమ్స్ బాండ్ ప్రాంచైజీ ఒకటే అయినప్పటికీ.. ఆ చిత్రాల్లో నటించిన హీరోలు మాత్రం చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు డేనియల్ క్రెయిగ్.
డేనియల్ క్రెయిగ్ పేరు తెలియని వారు కూడా.. అతడిని చూసి.. జేమ్స్ బాండ్ హీరో అని చెప్పేస్తారు. అయితే.. క్రెయిగ్ జేమ్స్ బాండ్ గా మారడానికి ముందే భారతీయ చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చింది! బాలీవుడ్ సినిమా ఛాన్స్ వచ్చినప్పటికీ.. డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవడంతో ఆ మూవీని వదిలేసుకున్నాడు డేనియల్ క్రెయిగ్.
ఆ చిత్రమే.. 'రంగ్ దే బసంతి'. 2006లో వచ్చిన ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. అమీర్ ఖాన్, టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ తదితరులు కలిసి నటించిన ఈ మూవీ సంచలన విజయం నమోదు చేసింది. ఈ చిత్రంలో డేనియల్ నటించాల్సి ఉంది. కానీ.. కుదరలేదు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు ఓం ప్రకాశ్ మెహ్రా తన ఆటో బయోగ్రఫీలో వెల్లడించారు.
తన ఆత్మకథ 'ది స్ట్రెంజర్ ఇన్ ది మిర్రర్'లో ఈ చిత్రానికి సంబంధించిన విషయం వెల్లడించారు. 'రంగ్ దే బసంతి' చిత్రంలో జైలర్ పాత్ర ఉంటుంది. ఈ రోల్ ను మెక్ కిన్ లే పోషించారు. అయితే.. ఈ క్యారెక్టర్ కు ఎంతో మంది ఆర్టిస్టులను పరిశీలించాడట మెహ్రా. కానీ.. ఎవ్వరూ తనకు నచ్చలేదు. అయితే.. చివరకు డేనియల్ క్రెయిగ్ ఆ పాత్రకు సరిగ్గా సరిపోతాడని భావించాడట.
అయితే.. అదే సమయంలో జేమ్స్ బాండ్ సిరీస్ లో నటించే అవకాశం వచ్చింది డేనియల్ కు. దీంతో.. కొంత టైమ్ కావాలని కోరాడట డేనియల్. కానీ.. అప్పటికే షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడం.. చిత్రీకరణ లేటవుతుండడం వంటి కారణాలతో.. వీలు కాలేదట. ఆ విధంగా.. జైలర్ పాత్రను మెక్ కిన్ లే పోషించారు. ఇండియన్ సినిమాలో నటించే ఛాన్స్ క్రెయిగ్ మిస్సయ్యాడు.