కరోనా-లాక్ డౌన్ తో మూతబడిన థియేటర్లు తెరుచుకోనున్నాయి. జూలై 10 నుంచి థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నాయని సమాచారం. అయితే అది మనం దేశంలో కాదు.. ప్రపంచంలోనే అత్యధికంగా కేసులు నమోదైన అమెరికాలో.. అవును ఈ మేరకు అక్కడ థియేటర్లు ఓపెన్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
జూలై 10న అమెరికాలోని లాస్ ఏంజిల్స్, న్యూయార్క్ నగరాల్లో సినిమా థియేటర్లు ఓపెన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని అమెరికా వార్తసంస్థ చేసిన ట్వీట్ ను ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్ష్ రీట్వీట్ చేశారు. దీంతో అమెరికా సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సినిమాలు, థియేటర్లు బంద్ అయ్యి నెలలు గడుస్తోంది. ఇండియా సహా అన్ని దేశాల్లో సినీ అభిమానులు తమతమ స్టార్స్ సినిమాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో థియేటర్స్ ఓపెన్ చేయడం శుభపరిణామంగా భావిస్తున్నారు.
అయితే భారతదేశంలో మాత్రం థియేటర్స్ ఓపెన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోంది. దేశంలో జనాభా ఎక్కువగా ఉండడం.. కరోనా వ్యాప్తికి థియేటర్లు, విద్యాసంస్థలు వాహకాలుగా మారుతాయనే భయంతో వాటికి అనుమతులు ఇవ్వడం లేదు. ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాలు షూటింగ్ లకు అనుమతులు ఇస్తున్నాయి. థియేటర్స్ ఓపెన్ కాకపోవడంతో పూర్తైన సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు.