అఖిల్ మూడవ సినిమా 'మిస్టర్ మజ్ను' గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖిల్ మొదటి రెండు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా మంచి ఓపెనింగ్స్ ను అయితే రాబట్టాయి. మూడవ సినిమాతో ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ ను దక్కించుకుని అభిమానులకు తనపై ఉన్న నమ్మకంను నిలుపుకోవాలని అకిల్ భావించి మజ్నుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాని మూడవ సినిమా కూడా నిరాశ పర్చింది. ఈసారి మరింత షాకింగ్ విషయం ఏంటీ అంటే మొదటి రెండు సినిమాలకు వచ్చిన ఓపెనింగ్స్ కూడా మజ్ను సినిమాకు రాలేదు. మొదటి మూడు రోజుల్లో కనీసం 10 కోట్ల వసూళ్లను కూడా ఈ చిత్రం రాబట్టలేక పోవడంతో డిస్ట్రిబ్యూటర్లు కంగారుపడుతున్నారు.
లాంగ్ రన్ లో కాస్తో కూస్తో వసూళ్లు వస్తాయని ఆశించారు. కాని పరిస్థితి చూస్తుంటే ప్రమాధకరంగా ఉంది. ఆది వారం వరకు ఒక మోస్తరుగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం సోమవారం మరీ డ్రాప్ అయ్యింది. ఎఫ్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇంకా సందడి కొనసాగిస్తున్న నేపథ్యంలో మిస్టర్ మజ్ను చిత్రం చేతులు ఎత్తేసినట్లయ్యింది. వీకెండ్స్ లో గౌరవ ప్రధమైన కలెక్షన్స్ రాబట్టిన మజ్ను వీక్ డేస్ స్టార్ అయ్యాయో లేదో అప్పుడే బాక్సాఫీస్ సందడి తగ్గిపోయింది. సోమవారం పలు థియేటర్లలో దారుణమైన షేర్ వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఈ చిత్రం అఖిల్ కు మూడవ ఫ్లాప్ అంటూ ట్రేడ్ వర్గాల వారు ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని నిర్మించిన బివిఎస్ ఎన్ ప్రసాద్ మరియు సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు తీవ్ర నష్టాలు తప్పవని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఫలితం అఖిల్ కెరీర్ పై కూడా చాలా ప్రభావం పడే అవకాశం ఉంది. స్టార్ హీరోల జాబితాలో చేరతాడని ఆశించిన అక్కినేని అభిమానులు ఈ సినిమాతో తమ నమ్మకంను మరింతగా డ్రాప్ చేసుకునే అవకాశం ఉంది. అఖిల్ 4వ సినిమా ఓపెనింగ్స్ మరింతగా తగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.