అక్కినేని అఖిల్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వ ం వహించిన `మిస్టర్ మజ్ను` జనవరి 25న అత్య ంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భ ంగా అఖిల్ అన్నపూర్ణ ఏడెకరాల్లో జరిగిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర సంగతుల్ని తెలిపారు. మిస్టర్ మజ్ను టైటిల్ గురించి మాట్లాడుతూ.. అది అక్కినేని కుటుంబానికి కలిసొచ్చిన టైటిల్ .. తాత, నాన్న గారికి బాగా కలిసొచ్చిన టైటిల్ కూడా.. ఇప్పుడు నాక్కూడా ఈ టైటిల్ పెద్ద ప్లస్ అవుతుందని భావిస్తున్నా అని అన్నారు అఖిల్. ఈ సినిమాతో ష్యూర్ షాట్ గా హిట్ కొడుతున్నానని ధీమాని వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో ప్లే బోయ్ నుంచి లవర్ గా మారే పాత్రలో నటించాను. కుటుంబ బంధాలు అనుబంధాలతో పాటు లవ్, రొమాన్స్ .. పూర్తి వినోదం, ఎమోషన్ ఆకట్టుకుంటాయి. ఈ పాత్ర ఓకే అనుకున్న తర్వాత దానిపైనే ఎక్కువ వర్క్ చేశాను. మిస్టర్ మజ్ను నన్ను పరాజయాల నుంచి బయటపడేసే సినిమా అన్న నమ్మకం పెరిగింది. ఇక ఈ చిత్రాన్ని వెంకీ పూర్తిగా మోడ్రన్ వేలో తీర్చిదిద్దాడు. యూత్ తో పాటు అందరికీ నచ్చే విధంగా సినిమాని తీర్చిదిద్దాడు.
మజ్ను అంటే పాత ట్రెండ్. అందుకే మిస్టర్ మజ్ను అంటూ నేటి యూత్ కి కనెక్టయ్యేలా టైటిల్ పెట్టుకున్నాం. మజ్ను అని టైటిల్ వినగానే విషాదాంతం ఉంటుందా..? అని కొందరికి సందేహాలున్నాయి. కానీ అలాంటిదేం లేదు. ఒక ప్లేబోయ్ లవర్ బోయ్ గా మారాక ఏం జరుగుతుందన్నది తెరపై చూడొచ్చు. అతడి జీవితంలో మలుపులు ఆకట్టుకుంటాయి.. అని తెలిపారు. మిస్టర్ మజ్ను అక్కినేని బ్రాండ్ సినిమా అనడంలో సందేహం లేదు.. అని అఖిల్ తెలిపారు. ఇంకా ఒకరోజులో ఈ చిత్రం ఫలితం తేలనుంది. అఖిల్, హలో లాంటి పరాజయాల తర్వాత ఈ సినిమాతో ఎట్టి పరిస్థితిలో సక్సెస్ దక్కుతుందన్న ధీమాని అఖిల్ కనబరచడం విశేషం. బరచడం విశేషం.
Full View