వీడియో : ఆడవాళ్లు గ్రేట్‌ అంటున్న మిస్టర్ ప్రెగ్నెంట్‌

Update: 2022-05-08 06:48 GMT
నేడు మదర్స్‌ డే సందర్బంగా పలు సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ మరియు వీడియోలను విడుదల చేస్తున్నారు. అందులో అందరి దృష్టిని ఆకర్షించే విధంగా మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా యొక్క గ్లిమ్స్ వీడియో ఉంది. బిగ్‌ బాస్ ఫేమ్ సోహెల్‌ హీరోగా శ్రీనివాస వింజనంపాటి దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ ప్రెగ్నెంట్‌ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్‌ లుక్ వచ్చి జనాల్లో ఆసక్తిన కలిగించింది.

టైటిల్‌ చాలా విభిన్నంగా ఉండటంతో సినిమా చాలా ప్రత్యేకంగా ఉంటుందనే నమ్మకం అందరిలో కలుగుతుంది. సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం కలుగుతున్న ఈ సమయంలో నేడు మదర్స్ డే సందర్బంగా ఈ వీడియోను విడుదల చేసి సినిమా పై అంచనాలను మరింతగా పెంచారు అనడంలో సందేహం లేదు. హీరోగా సోహెల్ వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు.

సోహెల్‌ నటిస్తున్న సినిమాల్లో మిస్టర్ ప్రెగ్నెంట్‌ సినిమా చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆయన ఈ సినిమా తో నటుడిగా మంచి పేరు ను దక్కించుకుంటాడు అనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విడుదల అయిన వీడియో లో.. తొమ్మిది నెలల కష్టాన్ని నవ్వుతూ భరించి ఒక బిడ్డకు జన్మనివ్వడం అది కూడా చావుకు తెగించి... ఈ ఆడవాళ్లు గ్రేట్‌ సర్ అంటూ సోహెల్‌ మీడియా ముందు మాట్లాడుతున్న డైలాగ్ ఆకట్టుకుంది.

ఈ ఆడవాళ్లు గ్రేట్‌ సర్ అంటూ అతడు చెప్పిన డైలాగ్‌ తోనే సినిమాలో ఆడవాళ్లకు ముఖ్యంగా అమ్మలకు చాలా ప్రాముఖ్యత ఇవ్వడంతో పాటు వారి యొక్క ప్రాముఖ్యత గొప్పతనంను చూపించబోతున్నారు అని క్లారిటీ వచ్చింది. హీరోగా సోహెల్‌ ఈ సినిమా తో ఒక మంచి గుర్తింపును దక్కించుకోవడం ఖాయం అనిపిస్తుంది.

యూట్యూబ్‌ లో మైక్‌ టీవీ పేరుతో ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్ ను అందించి... షార్ట్‌ ఫిల్మ్స్ ను నిర్మించిన అప్పి రెడ్డి మరియు రవి రెడ్డిలు ఈ సినిమా తో నిర్మాతలుగా మారుతున్నారు. మైక్‌ మూవీస్ బ్యానర్ లో రాబోతున్న ఈ సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యిందని త్వరలోనే విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Full View



Tags:    

Similar News