లాక్ డౌన్ అవ్వడంతో థియేటర్లు మూసి ఉన్నాయి. గత రెండు నెలలుగా ప్రేక్షకులు ఎంటర్ టైన్ మెంట్ ను అందించేవి కేవలం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ మాత్రమే. టీవీలు పెట్టినా కూడా ఎప్పుడు వచ్చిన షో లు.. సీరియల్స్ వస్తున్నాయి. వార్తలు పెడితే కరోనా గురించే చెబుతున్నారు. దాంతో ఇండియాలో అత్యధికులు ఓటీటీని ఆశ్రయించారు. గత రెండు నెలల కాలంలో ఓటీటీ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అమెజాన్ ప్రైమ్.. నెట్ ప్లిక్స్.. హాట్ స్టార్ ఇలా అన్ని ఓటీటీలు కూడా అత్యధిక సబ్‌స్క్రిప్షన్స్ ను దక్కించుకున్నాయి. వినియోగదారుల కోసం ఓటీటీ లు ఒరిజినల్ కంటెంట్ ను తీసుకు వస్తున్నాయి. కోట్లు ఖర్చు చేసి సినిమా స్థాయిలో వెబ్ సిరీస్ లను తెరకెక్కిస్తున్నారు.
ఈమద్య కాలంలో నెట్ ప్లిక్స్ లో మిసెస్ సీరియల్ కిల్లర్ స్ట్రీమ్ అవుతోంది. బాలీవుడ్ స్టార్స్ మనోజ్ బాజ్ పేయి.. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కలిసి నటించిన ఈ వెబ్ సిరీస్ అందరి దృష్టిని ఆకర్షించింది. సస్పెన్స్ థ్ల్రిర్ గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆధరణ లభించింది. మనోజ్.. జాక్వెలిన్ ల నటనపై విమర్శకుల ప్రశంసలు కురిపించారు. ప్రేక్షకులు భారీ ఎత్తున వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేస్తున్న సమయంలో ఇది తమిళ రాకర్స్ బారిన పడినది.
వెబ్ సిరీస్ ను కూడా తమిళ రాకర్స్ పైరసీ చేశారు. ప్రస్తుతం మిసెస్ సీరియల్ కిల్లర్ ఆన్ లైన్ లో లభిస్తుంది. దాంతో నెట్ ఫ్లిక్స్ కు భారీ నష్టం వాటిల్లుతుందట. కేవలం నెట్ ప్లిక్స్ మాత్రమే కాకుండా దాదాపు అన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ ల్లోని ఒరిజినల్ కంటెంట్ ను మరియు సినిమాలను తమిళ రాకర్స్ పైరసీ చేస్తున్నారు. దాంతో వారికి భారీగా నష్టం వాటిల్లుతుందట. సినిమాల నిర్మాతల నష్టం కలిగించిన తమిళ రాకర్స్ ఇప్పుడు ఓటీటీ వారికి కూడా నష్టం కలిగిస్తున్నారు. ముందు ముందు పూర్తిగా ఓటీటీ లోకి మారబోతున్నాం. అప్పుడు తమిళ రాకర్స్ మరింతగా విజృంభించే ప్రమాధం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.