మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న 'సీతారామం' ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. యుద్ధ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథా చిత్రం సౌత్ తో పాటు నార్త్ ప్రేక్షకులను సైతం విశేషంగా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది మృణాల్ ఠాకూర్.
దుల్కర్ సల్మాన్ కి జోడిగా 'సీతామహాలక్ష్మి' పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచిన ఈ ముద్దుగుమ్మకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు.. ఆపై మరాఠీ, హిందీ భాషల్లో అడపా తడపా సినిమాలు చేసింది. కానీ స్టార్ ఇమేజ్ మాత్రం దక్కలేదు.
అయితే 'సీతారామం' విడుదల తర్వాత మృణాల్ పేరు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ మూవీతో మృణాల్ దశ తిరిగిందని.. ఇక ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో ఫుల్ బిజీ అవుతుందని అందరూ భావించారు. కానీ సీతారామం విడుదలై ఇన్ని రోజులు గడుస్తున్నా.. మృణాల్ నుంచి కొత్త ప్రాజెక్ట్ ల అనౌన్స్మెంట్ రాలేదు.
సోషల్ మీడియాలో మాత్రం సూపర్ యాక్టివ్ గా ఉంటూ అదిరిపోయే ఫోటోషూట్లను కుర్రకారును అల్లాడిస్తోంది. అలాగే పలు బ్రాండ్లకు ప్రచార కర్తగా వ్యవహరిస్తుంది. కానీ, తదుపరి చిత్రాలను మాత్రం అనౌన్స్ చేయడం లేదు. అసలు మృణాల్ ఎందుకింత సైలెంట్ గా ఉంటుందో అర్థం కాక అభిమానులు వర్రీ అవుతున్నారు.
అయితే మృణాల్ సైలెన్స్ వెనుక రెండు కారణాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. 'సీతారామం' తర్వాత మళ్లీ అదే స్థాయిలో హిట్ కొట్టాలని మృణాల్ భావిస్తుందట. ఈ నేపథ్యంలోనే కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోందట. అందుకే కొత్త ప్రాజెక్ట్ ల అనౌన్స్మెంట్ ఆలస్యం అవుతుందని ఓవైపు టాక్ వినిపిస్తోంది.
మరోవైపు 'సీతారామం' ఘన విజయం సాధించడంతో మృణాల్ తన రెమ్యునరేషన్ ను బాగా పెంచేసిందట. రూ. 1.5 కోట్లు ఇస్తేనే సినిమాకు సైన్ చేస్తానని తెగేసి చెబుతుందట. ఇక ఆమె డిమాండ్ చూసి నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. మరి ఇంతకీ ఈ ప్రచారాల్లో ఏది నిజం అన్నది తెలియాలంటే మృణాల్ సెలెన్స్ ను వీడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.