కండ‌ల హీరోతో ఎం.ఎస్.ధోని బిగ్ డీల్

Update: 2019-08-30 07:18 GMT
రంగుల ప‌రిశ్ర‌మ మ‌త్తు మ‌హ‌త్తు క్రికెటర్ల‌పై ఏ స్థాయిలో ప‌ని చేస్తుందో తెలిసిందే. అందాల‌ క‌థానాయిక‌ల‌తో క‌లిసి వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించ‌డ‌మే కాదు... ఆ ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గానూ మారిపోతోంది. భామల‌తో ప్రేమాయ‌ణాలు ఆ త‌ర్వాత‌ పెళ్లి చేసుకుని సెటిలైపోతున్నారు యువ క్రికెట‌ర్లు. ప‌రిశీలిస్తే ఇదంతా ఒక కోణం మాత్ర‌మే. ప్ర‌స్తుత టీమిండియా ఆట‌గాళ్ల‌ను చూస్తే ఈ సంగ‌తి క్లియ‌ర్ క‌ట్ గా అర్థ‌మ‌వుతుంది.

ఇప్పుడు అదే రంగుల ప‌రిశ్ర‌మ క్రికెట‌ర్ల‌ను వేరే కోణంలోనూ ఆకర్షిస్తోంది. అదే సినిమాల నిర్మాణం. వినోద‌ రంగంలో పెట్టుబ‌డులు పెడితే భారీగా లాభాలు ఆర్జించ‌వ‌చ్చ‌న్న‌ది కొంద‌రి ఆలోచ‌న. తొలిగా టీమిండియా  మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ స‌రికొత్త ఆలోచ‌న‌తో ఈ రంగంలో ప్ర‌వేశిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఆయ‌న సొంతంగా ఓ బ్యాన‌ర్ ని స్థాపించి నిర్మాత‌గా సినిమాలు తీయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అందుకోసం త‌న ప్రియ‌త‌మ స్నేహితుడైన‌ బాలీవుడ్ హీరో జాన్ అబ్ర‌హాంతో క‌లిసి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల్ని నిర్మించాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ఈ ఇద్ద‌రి భాగ‌స్వామ్య‌ వెంచ‌ర్ కి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తొంద‌ర్లోనే తెలియ‌నున్నాయి.

`ఎం.ఎస్.ధోని : ది అన్ టోల్డ్ స్టోరి` పేరుతో ధోని బ‌యోపిక్ తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ క‌థానాయ‌కుడిగా.. ప‌రిమిత బ‌డ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం నిర్మాత‌ల‌కు భారీగా లాభాలు తెచ్చి పెట్టింది. బ‌హుశా.. ఆ లాభాల కిక్కు ధోనీకి కూడా ఎక్కింద‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. అయితే స‌క్సెస్ రేటు కేవ‌లం 10 శాతం లోపు ఉండే ఈ ప‌రిశ్ర‌మ‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు వ‌స్తున్నాడంటే గ్లామ‌ర్ రంగంపై అత‌డికి ఉన్న ప్యాష‌న్ ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.


Tags:    

Similar News