ధోని ట్రైలర్.. ఓ పెను సంచలనం

Update: 2016-08-14 07:30 GMT
మహేంద్ర సింగ్ ధోనీయా మజాకా అనుకుంటున్నారు అభిమానులు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఏమీ పెద్ద స్టార్ హీరో కాదు. సల్మాన్ ఖాన్.. అమీర్ ఖాన్.. షారుఖ్ ఖాన్ లాంటి వాళ్లతో అతడికి పోలికే లేదు. కానీ అతడి కొత్త సినిమా ట్రైలర్ మాత్రం ఇండియాలో ఇంకే ట్రైలర్ అందుకోలేని రికార్డులు నెలకొల్పుతోంది. రెండు రోజుల కిందటే రిలీజైన ‘ఎం.ఎస్.ధోని’ ట్రైలర్ ఇండియాలో అత్యంత వేగంగా కోటి వ్యూస్ మార్కును అందుకున్న ట్రైలర్ గా రికార్డు సృష్టించింది. దాదాపు 54 గంటల్లోనే ధోని ట్రైలర్ ఆ ఘనత సాధించింది. ప్రస్తుతం కోటి 7 లక్షల వ్యూస్.. 2.6 లక్షల లైక్స్ తో సాగుతోంది ధోని ట్రైలర్. కేవలం 24 గంటల్లోనే ధోని ట్రైలర్ కు 52 లక్షల వ్యూస్ రావడం విశేషం.

అంతకుముందు సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ ట్రైలర్ 24 గంటల్లో 33 లక్షల హిట్స్ తో అగ్రస్థానంలో ఉంది. దాన్ని భారీ తేడాతో అధిగమించింది ‘ధోని’ ట్రైలర్. ఆరంభ శూరత్వంతో సరిపెట్టుకుండా రెండో రోజు కూడా జనాల్ని బాగానే ఆకర్షించింది ఈ ట్రైలర్. దీన్ని బట్టే ధోని మీద తీసిన సినిమాపై జనాలు ఎంత క్యూరియాసిటీతో ఉన్నారో అర్థమవుతోంది. ధోని గురించి జనాలకంతా తెలిసిందే కదా.. ఇక సినిమా తీస్తే ఏం చూస్తారు అన్న సందేహాల్ని పటా పంచలు చేస్తూ టీమ్ ఇండియాలోకి రావడానికి ముందు ధోని ఎదిగిన వైనాన్ని తెలుసుకోవడానికి జనాలు చాలా ఆసక్తితో కనిపిస్తున్నారు. వెడ్నస్ డే.. బేబీ.. స్పెషల్ చబ్బీస్ సినిమాల దర్శకుడు నీరజ్ పాండే రూపొందించిన ఈ చిత్రం సెప్టెంబరు 30న ప్రేక్షకుల ముందుకొస్తుంది.
Tags:    

Similar News