బాలీవుడ్లో కొన్నేళ్లుగా బయోపిక్స్ జోరు సాగుతోంది. లెజెండరీ స్ప్రింటర్ మిల్కా సింగ్ జీవిత కథతో తెరకెక్కిన ‘బాగ్ మిల్కా బాగ్’ సూపర్ హిట్టవడడంతో అప్పట్నుంచి ఈ జానర్ సినిమాలకు మంచి ఊపు వచ్చింది. మేరీకోమ్.. అజహర్ సినిమాలకు కూడా మంచి వసూళ్లే వచ్చాయి. ఐతే ఇప్పటిదాకా వచ్చిన బయోపిక్స్ అన్నీ ఒకెత్తయితే.. ఇప్పుడు రాబోతున్న ‘ఎం.ఎస్.ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’ మరో ఎత్తు అని చెప్పాల్సిందే.
ఇండియన్ క్రికెట్ టీమ్ గ్రేటెస్ట్ ఎవర్ కెప్టెన్లలో ఒకడైన ధోని కెరీర్ ఎలా ఆరంభమైందో.. అతను ఎలా ఎదిగాడో.. ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా ఎలా గుర్తింపు తెచ్చుకున్నాడో అందరికీ తెలుసు. ఐతే అతడి కెరీర్ ఆరంభమవ్వడానికి ముందు ఏం జరిగిందన్నది చాలామందికి తెలియదు. ఆ విశేషాలతోనే నీరజ్ పాండే ‘ఎం.ఎస్.ధోని’ సినిమా తీశాడు. అంతర్జాతీయ కెరీర్ ఆరంభమవడానికి ముందు ధోని జీవితంలో జరిగిన విశేషాలన్నీ ఇందులో చూపించబోతున్నారు.
ముందు ‘ధోని’ సినిమా మొదలైనపుడు బాలీవుడ్ జనాలు పెద్దగా పట్టించుకోలేదు కానీ.. దీని ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూశాక మాత్రం అందరి ఆలోచన మారింది. అమీర్ ఖాన్.. షారుఖ్ ఖాన్.. సల్మాన్ ఖాన్.. హృతిక్ రోషన్ లాంటి హీరోల సినిమాలు రిలీజైనపుడు ఎంత హైప్ ఉంటుందో ‘ఎం.ఎస్.ధోని’కి కూడా అంతే హైప్ ఉంది. పైన చెప్పుకున్న హీరోల సినిమాలు సౌత్ లో అంతగా ఆడవు. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో క్రేజ్ ఉండదు. కానీ ధోని సినిమా అందుకు భిన్నం. ధోని తెలియంది ఎవరికి..? అతడి సినిమా అంటే అందరికీ ఆసక్తే. పైగా తెలుగు.. తమిళంతో పాటు కొన్ని రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా ఈ సినిమాను అనువదించారు. కాబట్టి ఈ సినిమా కలెక్షన్ల విషయంలో ప్రకంపనలు రేపడం ఖాయమని అంచనా వేస్తున్నారు.