మీకు తెలిసిన వ్యక్తి.. మీకు తెలియని ప్రయాణం.. ఇదీ టీమ్ఇండియా గ్రేటెస్ట్ కెప్టెన్లలో ఒకడైన మహేంద్రసింగ్ ధోని జీవిత కథతో తెరకెక్కుతున్న ‘ఎం.ఎస్.ధోని.. ది అన్ టోల్డ్ స్టోరీ’ ట్యాగ్ లైన్. ధోని సినిమాలో ఏం చూపించబోతున్నారనడానికి ఇండికేషన్ ఈ ట్యాగ్ లైన్. ధోని గురించి మనకు తెలియంది ఏముంది.. కొత్తగా ఏం చూపిస్తారు అని సందేహించినవాళ్లందరూ ఈ సినిమా ట్రైలర్ చూశాక అభిప్రాయాలు మార్చుకుంటారేమో. ఇండియాలో వచ్చిన బెస్ట్ స్పోర్ట్స్ బయో పిక్స్ లో ధోని సినిమా కూడా కచ్చితంగా ఉంటుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ధోని క్రికెటర్ అయ్యాక ఎలా ఎదిగాడో మనందరికీ తెలుసు. కానీ టీమ్ ఇండియాకు ఎంపిక కావడానికి ముందు అతడి జర్నీ ఏంటన్నది ఇందులో చూపిస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో చాలా సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ధోని.. ముందు ఫుట్ బాల్ మీద ఆసక్తి చూపించి ఆ తర్వాత క్రికెట్ లోకి ఎలా మళ్లాడు.. ఫ్యామిలీ కోసం రైల్వే టీటీ జాబ్ లో చేరి.. అందులో సంతృప్తి లేక.. క్రికెట్ లో కొనసాగలేక ఎలా అంతర్మథనానికి గురయ్యాడు. ఇలా ధోని జీవితంలోని ఆసక్తికర కోణాల్ని ఇందులో స్పృశిస్తున్నారు.
టీమ్ ఇండియా తరఫున ధోని మ్యాచ్ లు ఆడే క్రమాన్ని.. 2011 ప్రపంచకప్ ఫైనల్లో సిక్సర్ బాది జట్టును విజేతగా నిలిపిన క్రమాన్ని.. ఇంకా చాలా మ్యాచ్ ల విశేషాల్ని కూడా ఇందులో చూపిస్తున్నారు. ధోనిగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అదరగొట్టేసినట్లే ఉన్నాడు. బాడీ లాంగ్వేజ్ నుంచి బ్యాటింగ్ స్టైల్ వరకు అతను ధోనిని దించేశాడు. భార్య సాక్షి పాత్రలో భూమిక చావ్లా నటిస్తుండటం విశేషం. వెడ్నస్ డే.. స్పెషల్ చబ్బీస్.. బేబీ లాంటి మాంచి సినిమాలు తీసిన నీరజ్ పాండే ఈ చిత్రానికి దర్శకుడు. సెప్టెంబరు 30న ‘ఎం.ఎస్.ధోని ప్రేక్షకుల ముందుకొస్తుంది.
Full View