తమిళ్ లో గత ఏడాది విడుదలై సైలెంట్ హిట్ కొట్టేసిన కణా తెలుగు రీమేక్ కౌసల్య కృష్ణమూర్తి విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి కెఎస్ రామారావు నిర్మాత కాగా భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మొదటి ఆడియో సింగల్ రిలీజ్ అయ్యింది. ముద్దబంతి పువ్వుఇలా పైటలేసెనే అంటూ సాగే పాటలో హీరోయిన్ ఐశ్యర్య రాజేష్ పెద్ద మనిషి అయిన సందర్భాన్ని తనను కాబోయే భార్యగా కార్తీక్ రాజు ఊహించుకుంటూ ఆ వేడుకకు వచ్చే సిచువేషన్ ని సింక్ చేస్తూ చిత్రీకరించారు.
ఈ ట్యూన్ ఒరిజినల్ లోనిదే. ధిబు నినన్ థామస్ అందించిన సంగీతానికి కృష్ణకాంత్ సాహిత్యం యాసిన్ నాజిర్ గాత్రం చక్కగా తోడయ్యాయి. తన ప్రేయసి జీవితంలో గొప్ప మజిలీని ప్రియుడు ఆస్వాదిస్తున్న తీరుని చక్కగా వర్ణించారు. ఇందులో టైటిల్ రోల్ పోషిస్తున్న ఐశ్యర్య రాజేష్ ని విజువల్స్ లో చాలా న్యాచురల్ గా చూపించారు. ప్రియుడిగా కార్తీక్ రాజ్ యాప్ట్ గా ఉన్నాడు. పల్లెటూరిలో పుట్టి పెరిగిన అమ్మాయి జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడి గుర్తింపు తెచ్చుకున్న పాయింట్ మీద క్రికెట్ రూపొందిన కౌసల్య కృష్ణమూర్తి ఈ పాటే హై లైట్ అయ్యే ఛాన్స్ ఉంది.
తమిళ్ లో సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేసిన ఈ సాంగ్ ఆ స్థాయిలో ఇక్కడా క్లిక్ అవుతుందేమో చూడాలి. శివ కార్తికేయన్ క్యామియో చేసిన ఈ మూవీలో తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నారు. వచ్చే నెల విడుదల కానున్న కౌసల్య కృష్ణమూర్తి మీద లేడీ యూత్ అంచనాలు బాగానే ఉన్నాయి
Full View