`మిస్టర్ పెర్ఫెక్ట్` ప్రభాస్ హీరోగా.. సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ చిత్రం `సాహో ఆగస్టు 15న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు నిర్మాతలు అధికారికంగా రిలీజ్ తేదీని ప్రకటించారు. వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో ఇలాంటి సినిమా రాలేదు.. అన్నంత భారీతనంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందుకోసం ఏకంగా 300 కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మొత్తంలో 40-50 శాతం మేర కేవలం యాక్షన్ సన్నివేశాల కోసమే కేటాయిస్తున్నారని తెలుస్తోంది. ఇది వరకూ అబుదబీ లోని కాస్ట్ లీ ఫ్లైవోవర్లు, భారీ పార్కులు, రోడ్లపై అసాధారణం అనిపించే యాక్షన్ ఎపిసోడ్స్ ని తెరకెక్కించారు. అందుకు సంబంధించి మేకింగ్ వీడియోని `సాహో` మేకింగ్- చాప్టర్ 1 పేరుతో రిలీజ్ చేశారు. ఈ వీడియో యూట్యూబ్ లో రికార్డులు బ్రేక్ చేసింది.
ఇప్పటికే చివరి షెడ్యూల్ చిత్రీకరణకు సాహో బృందం ప్రిపరేషన్ లో ఉందని తెలుస్తోంది. నెలరోజుల పాటు ఏకంగా హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్ లో అత్యంత భారీగా యాక్షన్ దృశ్యాల్ని తెరకెక్కించనున్నారు. మ్యాట్రిక్స్, పెరల్ హార్బర్ వంటి భారీ యాక్షన్ చిత్రాలకు ఫైట్స్ ని అందించిన కెన్నీ బేట్స్ సారథ్యంలో ఈ యాక్షన్ సీన్స్ ని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. కేవలం ఈ ఒక్క ఫైట్ సీక్వెన్స్ కోసం 20 కోట్ల మేర బడ్జెట్ ని కేటాయించారట. నెవ్వర్ బిఫోర్! అన్నట్టుగా ఈ యాక్షన్ దృశ్యాన్ని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఒరిజినల్ గా ఈ షెడ్యూల్ ని ముంబైలోని వర్లీ - బాంద్రా కనెక్షన్ కి సంబంధించిన బ్రిడ్జి - సముద్రం పై తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ అక్కడ అధికారుల నుంచి అనుమతులు రావడం కష్టమైంది. రక్షణకు సంబంధించిన రకరకాల సమస్యలు ఉండడంతో పర్మిషన్స్ రాలేదట. దాంతో షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీకి షిఫ్టయింది. ఇక్కడ ఇప్పటికే భారీ సెట్ ని నిర్మించారు. ప్రభాస్ - నీల్ నితిన్ బృందంపై భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ని తెరకెక్కిస్తారట. మార్చి చివరి నాటికి ఈ భారీ యాక్షన్ సీన్ ని పూర్తి చేసి సైమల్టేనియస్ గా ఎడిటింగ్, నిర్మాణానంతర పనులు పూర్తి చేయనున్నారట.
ఇంత భారీగా షెడ్యూల్ చేస్తున్నారు కాబట్టి, ఆన్ లొకేషన్ నుంచి ఒక్క ఫోటో కూడా బయటకు లీక్ కాకూడదని చిత్రబృందం కఠినంగా రూల్ పెట్టిందట. ఇప్పటివరకూ ఆ సెట్స్ కి సంబంధించిన ఫోటో బయటకు లీక్ కాలేదు. మరోవైపు ఆగస్టు 15 డెడ్ లైన్ ప్రకారం సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయాలంటే సైమల్టేనియస్ గా చేయాల్సినవన్నీ పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది.