వినాశకాలే విపరీతబుద్ధి.. నువ్వు అలానే మాట్లాడావ్.. 'రౌడీ'పై థియేటర్ యజమాని ఫైర్

Update: 2022-08-27 04:36 GMT
టైం మనం అనుకున్నట్లుగా నడిచిపోయినంత కాలం నిజాలు బయటకు రావు. ఒక్కసారి తేడా కొడితే.. నిజాలు కక్కుకుంటూ బయటకు వచ్చేస్తుంటాయి. తనకున్న ఇమేజ్ ఎంత? అన్న విషయం ఒక ప్రముఖ నటుడికి సక్సెస్ కంటే కూడా ఫెయిల్యూర్ వేళ బాగా అర్థమవుతుంది. లైగర్ మూవీతో సంచలనాన్ని క్రియేట్ చేస్తారన్న అంచనాలకు భిన్నంగా ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చటమే కాదు.. విజయ్ దేవరకొండ కెరీర్ లో భారీ డిజాస్టర్ గా చెబుతున్నారు. ఇలాంటి వేళ.. అతని మాటల్ని పలువురు తప్పు పడుతున్నారు.

సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆగస్టు 25న భారతదేశాన్ని షేక్ చేస్తానంటూ విజయ్ దేవరకొండ చేసిన మాటలపై అప్పట్లోనే ఆగ్రహం వ్యక్తమైంది. అయితే.. ఆయన ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరో మాటల్ని వెనకేసికొస్తూ.. సర్దుబాటు చేసిన వైనం తెలిసిందే. దేశాన్ని షేక్ చేయటం కాదు.. మాకు 90 ఎంఎం రాడ్ దింపాడంటూ సటైర్లు వేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఫలితం మీద ముంబయికి చెందిన ఒక థియేటర్ యజమాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

ముంబయికి చెందిన థియేటర్ యజమాని మనోజ్ దేశాయ్.. తాజాగా విజయ్ దేవరకొండ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అతడో ఇంటర్వ్యూ ఇస్తూ.. తన సినిమాను బాయ్ కాట్ చేసుకోండంటూ చెప్పి తెలివిని ప్రదర్శించానని అనుకున్నాడని.. అతడి ప్రవర్తన కారణంగా సినిమాను ఓటీటీలో కూడా చూడరన్నారు.

'నీ ప్రవర్తన వల్ల మేం నష్టపోతున్నాం. అడ్వాన్స్ బుకింగ్స్ పై కూడా ఎఫెక్టు పడింది. మిస్టర్ విజయ్.. నువ్వు కొండవి కావు అనకొండవి. అనకొండలానే మట్లాడావు. వినాశకాలే విపరీతబుద్ధి అంటారు.నాశనమయ్యే సమయం దగ్గర పడ్డప్పుడు.. నోటి నుంచి ఇలాంటి మాటలే వస్తాయి. నువ్వు అలాగే మాట్లాడావు కూడా. నువ్వు చాలా అహంకారివి.. నచ్చితే చూడండి.. ఇష్టం లేకపోతే అసలు చూడొద్దు లాంటి మాటలు ఎంత చేటు తెచ్చాయో నీకింకా అర్థం కావటం లేదా?" అంటూఒక రేంజ్ లోఫైర్ అయ్యాడు.

అమిర్ ఖాన్.. తాప్సీ..అక్షయ్ కుమార్ లాంటి వారి సినిమాలు ఎలా కొట్టుకుపోయాయోచూడలేదా? లైగన్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా. కానీ.. నువ్వు నోటికి వచ్చినట్లు మాట్లాడటం వల్ల నష్టం జరిగింది" అని వాపోయారు.

లైగర్ తో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన వేళ.. ప్రమోషన్లో భాగంగా దేశంలోని పదిహేడు నగరాల్ని పర్యటించిన వేళలో అతడి మీద వ్యక్తమైన క్రేజ్ కు.. సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన ఓపెనింగ్స్ కు సంబంధం లేకపోవటం తెలిసిందే. సినిమా మీద వచ్చిన టాక్ వసూళ్ల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందన్న మాట వినిపిస్తోంది.
Full View

Tags:    

Similar News