ట్రైలర్ టాక్: మున్నా 'మైకేల్' జాక్సన్

Update: 2017-06-06 04:11 GMT
జాకీ ష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ మున్నా మైకేల్. పేరులో మైకేల్ ను పెట్టడమే కాదు.. ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ ను చూస్తే.. ఆ టైటిల్ పెట్టడం వెనక కారణం అర్ధమవుతుంది. చిన్నప్పటి నుంచి మైకేల్ జాక్సన్ ను ఆరాధిస్తూ పెరిగానంటూ మొదలు పెట్టిన ట్రైలర్ లో.. అన్ని హంగులు అమరాయి.

టైగర్ ష్రాఫ్ తనకు ఏ జోనర్ లో అయితే స్ట్రెంగ్త్ ఉందో.. అదే కాన్సెప్ట్ తో వస్తున్నాడు. డ్యాన్స్.. ఫైట్స్.. ఈ రెండింటినీ ఇరగదీసేస్తాడు టైగర్ ష్రాఫ్. ఈ మున్నా పాత్రలో వేసే మైకేజ్ జాక్సన్ స్టెప్స్ కూడా అలాంటివే. రోడ్ సైడ్ కుర్రాడిగా టైగర్ ష్రాఫ్.. స్టార్లెట్ గా కొత్తమ్మాయి నిధి అగర్వాల్.. జాలి దయ లేని రౌడీ పాత్రలో నవాజుద్దీన్ సిద్దిఖీ.. ముగ్గురూ కలిసి డ్యాన్స్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసం ప్రాక్టీస్ లు.. గొడవలు.. హంగామా అదరగొట్టేశారు. మధ్యమధ్యలో టైగర్ ష్రాఫ్ స్టెప్స్ ను అరకొరగా చూస్తేనే మైండ్ బ్లాంక్ అవడం ఖాయం. మైకేల్ జాక్సన్ కు ట్రిబ్యూట్ మాదిరిగా డ్యాన్సింగ్ తో సెన్సేషన్ సృష్టిస్తున్నాడు టైగర్ ష్రాఫ్.

నవాజుద్దీన్ లాంటి యాక్టర్ తో స్టెప్పులు వేయించడం అనే కాన్సెప్ట్ కూడా బాగా ఆకట్టుకుంది. టైగర్ తో కొన్ని పంచ్ డైలాగ్స్ కూడా పేల్చారు. కొత్త హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా బాగా ఆకట్టుకుంటోంది. యాక్షన్ ఎపిసోడ్స్ అయితే.. ఒళ్లు గగుర్పొడిలా రూపొందించారు. అన్నిటికీ మించి ఈ మున్నా పాత్రకు.. టైగర్ ష్రాఫ్ సరిగ్గా సరిపోయాడని చెప్పచ్చు.

ట్రైలర్ కోసం క్లిక్ చేయండి

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News