కమల్ హాసన్ ఛాన్స్ ఇవ్వడంతో అతి తక్కువ టైమ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రేంజ్ కి వెళ్లిపోయాడు జిబ్రాన్. వరుసగా కమల్ నటించిన సినిమాలకి ట్యూన్స్ ఇవ్వడం జిబ్రాన్ కెరీర్ కి ప్లస్ అయింది. దీంతో ఇటు తెలుగులో అటు తమిళంలో జిబ్రాన్ డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. తెలుగులో కూడా రన్ రజా రన్, హైపర్, జిల్ వంటి సినిమాలు జిబ్రాన్ కు మంచి గుర్తింపుని ఇచ్చాయి. ఈ నేపథ్యంలో జిబ్రాన్ ప్రస్తుతం సునీల్ అప్ కమింగ్ మూవీ ఉంగరాల రాంబాబుకి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడు. ఇటీవలే ఉంగరాల రాంబాబు టీమ్ రెండు పాటల్ని ఆన్ లైన్ లో విడుదల చేసింది. ఈ పాటలకి వచ్చిన రెస్పాన్స్ అటు ఉంచితే, సినిమా రిలీజ్ చేద్దామని రెడీ అవుతున్న నిర్మాతకి జిబ్రాన్ చుక్కలు చూపిస్తున్నాడని ఫిల్మ్ నగర్ కోడై కూస్తోంది.
సినిమా షూటింగ్ ముగిసి, తదితర కార్యక్రమాలు కూడా ముగిసి రెండు నెలలు కావాస్తున్నా ఇప్పటికి రీరికార్డింగ్ ను కంప్లీట్ చేయలేదట జిబ్రాన్. దాదాపు 50 రోజులు నుంచి ఉంగరాల రాంబాబు చిత్ర బృందాన్ని తన చుట్టూ తిప్పుకుంటున్నాడట ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్. దీంతో చేసేదేమి లేక, జిబ్రాన్ ప్లేస్ లోకి మరో రికార్డింగ్ టెక్నీషయన్ ని తీసుకున్నట్లు తెలిసింది. మరి కొత్తగా వచ్చిన ఆ టెక్నీషయన్ జిబ్రాన్ వదిలేసిన వర్క్ ని సకాలంలో పూర్తి చేస్తాడో లేదో చూడాలి.