దేవీశ్రీ‌- త‌మ‌న్ ల‌ను వెన‌క్కి నెడ‌తాడా?

Update: 2022-08-14 13:30 GMT
సంగీతం ప‌లు ర‌కాలు.. చెవిలో రొద పెట్టేది.. చెవికి ఇంపుగా ఉండేది.. ఈ రెండూ కాకుండా ఉర్రూత‌లూగించే సంగీతం వేరు. అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టు కేట‌గిరీ వైజ్ సంగీతం అందించాలి. సినిమా థీమ్ ను న‌డిపించే బీజీఎంతో మ‌న‌సులు గెలుచుకోవాలి. అప్పుడు మాత్ర‌మే ఆ సంగీత ద‌ర్శ‌కుడికి గౌర‌వం ద‌క్కుతుంది. ఇళ‌య‌రాజా- ఏ.ఆర్.రెహ‌మాన్- ఎం.ఎం.కీర‌వాణి- హ్యారిష్ జైరాజ్- మ‌ణిశ‌ర్మ‌ లాంటి ట్యాలెంట్ త‌ర్వాత దేవీశ్రీ‌- త‌మ‌న్ లాంటి వాళ్ల హ‌వా కొన‌సాగుతోంది. ఇంకా ఎంద‌రో ఉన్నా కానీ ట్రెండింగ్ లో కొన‌సాగుతున్న పేర్లు ఇవ‌న్నీ.

ఇప్పుడు మ‌రో యువ సంగీత ద‌ర్శ‌కుడి పేరు ప్ర‌ముఖంగా ట్రెండ్స్ లో వినిపిస్తోంది.  లెజెండరీ MM కీరవాణి తనయుడు కాల భైరవ పేరు ఇటీవ‌ల‌ మార్మోగుతోంది. తాజాగా నిఖిల్ న‌టించిన హిట్ చిత్రం `కార్తికేయ 2` కోసం అతని మ్యూజిక్ స్కోర్ - BGM ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంటున్నాయి. కార్తికేయ 2 చిత్రాన్ని మరో స్థాయికి పెంచిన సంగీతం అత‌డి నుంచి పుట్టుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి షో పూర్త‌యిన‌ క్షణం నుండి కాలభైరవ ప‌నిత‌నంపై పెద్ద ఎత్తున ప్రశంస‌లు కురిసాయి.

అడ్వెంచర్ థ్రిల్లర్ కార్తికేయ 2కి కొత్త సౌండింగ్ ని క్రియేట్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంది. కాలభైరవ బాబాయ్.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజమౌళి .. నాన్న కీరవాణి ఇంత‌కుముందే హైదరాబాద్ లో షోను వీక్షించారు. అనంత‌రం యువ సంగీతకారుడిని గర్వంగా కౌగిలించుకోవడం ప్రీమియ‌ర్ హాల్ లో కనిపించింది. కాల భైరవ సంగీతం అందించిన‌ `కలర్ ఫోటో` ఇటీవల జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. మ‌త్తు వ‌ద‌ల‌రా చిత్రానికి అత‌డు  చ‌క్క‌ని సంగీతం అందించాడు. ఇప్పుడు అరడజనుకు పైగా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అత‌డు కీర‌వాణికి మాత్ర‌మే కాదు మునుముందు లీడ్ లో ఉన్న సంగీత ద‌ర్శ‌కుల‌కు పోటీ కాగ‌ల‌డు.

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో లీడ్ లో ఉన్న పేర్ల‌లో ఓ ఇరువురు మ్యూజిక్ డైరెక్ట‌ర్ల పేర్లు ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. దేవీశ్రీ ప్ర‌సాద్.. త‌మ‌న్ మెజారిటీ పార్ట్ భారీ ప్రాజెక్టుల‌ను ఛేజిక్కించుకుంటున్నారు. ఆ ఇద్ద‌రికీ కాల భైర‌వ పోటీగా నిలుస్తారా? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.
Tags:    

Similar News