నా అతిపెద్ద డ్రీమ్‌ అదేః సోనూ సూద్

Update: 2021-06-15 04:30 GMT
క‌రోనా మొద‌టి ద‌శ నుంచీ.. త‌న సేవాకార్య‌క్ర‌మాల‌తో ఈ దేశ‌పు నిజ‌మైన హీరోగా వెలుగొందుతున్నాడు సోనూ సూద్‌. అధికారం చేతిలో ఉన్న‌వాళ్లు క‌రోనా బాధితుల గురించి ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వినిపిస్తున్న చోట‌.. సోనూ సూద్ స‌హాయం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. అత‌డే ఒక సైన్యంలా అందిస్తున్న స‌హ‌కారానికి అంద‌రూ ముగ్ధుల‌వుతున్నారు.

కార్మికుల‌ను సొంత ప్రాంతాల‌కు త‌రలించ‌డం నుంచి మొద‌లైన అత‌ని సేవా కార్య‌క్ర‌మాలు.. నిరంత‌రాయంగా కొన‌సాగుతూనే ఉన్నాయి. సెకండ్ వేవ్ లో మందులు స‌ర‌ఫ‌రా చేయ‌డం నుంచి ఆక్సీజ‌న్‌, ఆసుప‌త్రుల్లో బెడ్లు స‌మ‌కూర్చ‌డం వ‌ర‌కు ఎన్నో విధాలుగా సేవ‌లందిస్తున్నాడు. సోనూ సేవ‌ల‌కుగానూ ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు ఇవ్వాల‌నే డిమాండ్ కూడా తెర‌పైకి వ‌చ్చింది.

ఇంత‌లా సేవ‌లు అందిస్తున్న సోనూ.. త‌న అతిపెద్ద క‌ల ఏంటో వెల్ల‌డించాడు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో తన బిగ్గెస్ట్ డ్రీమ్ గురించి వివ‌రించాడు. పేద ప్రజలకు నాణ్య‌మైన‌ ఉచిత విద్య, ఉచిత వైద్య‌స‌దుపాయం అందించ‌డం త‌న క‌ల అని అన్నారు. ఇందుకోసం.. పాఠశాలలు, ఆసుపత్రులను నిర్మించాల‌న్న‌ది త‌న అతిపెద్ద ఆశ‌యం అని చెప్పాడు. ‘‘ఇది వెంటనే సాధ్యం కాదని నాకు తెలుసు, కానీ.. ఇది నా చిరకాల స్వప్నం. ఏదో ఒక రోజు నా కలను నేను ఖచ్చితంగా సాకారం చేసుకుంటాను’’ అని ధీమా వ్యక్తం చేశాడు సోను.
Tags:    

Similar News