బాలీవుడ్ లో కొన్నేళ్ల క్రితం వచ్చిన కంగనా రనౌత్ హీరోయిన్ గా వచ్చిన క్వీన్ సినిమా పేరు ఇప్పుడు తెగ వినిపిస్తోంది. సౌత్ లో ఉన్న నాలుగు భాషల్లోనూ ఈ సినిమా ఒకేసారి రీమేక్ అవుతుండటమే ఇందుకు కారణం. ఒకో భాషలో ఒకో హీరోయిన్ లీడ్ రోల్ లో నటించనుంది. తెలుగు వెర్షన్ లో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంటే మళయాళ వెర్షన్ లో సాహసం శ్వాసగా సాగిపో ఫేం మంజిమా మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు వెర్షన్లనూ డైరెక్ట్ చేస్తోంది మన తెలుగు దర్శకుడు నీలకంఠయే.
మళయాళంలో క్వీన్ రీమేక్ ను జామ్ జామ్ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే కంప్లీట్ చేశారు. ఒరిజినల్ సినిమాను మక్కీకి మక్కీ దింపడం లేదని.. దర్శకుడు తనదైన స్టయిల్ లో మార్పులు చేశాడని చెబుతోందని మంజిమా మోహన్. ‘‘ఈ సినిమాలో నేను బీరు తాగే సీన్ ఒకటి ఉంది. అది నాకు భలే నచ్చింది. సీన్ కూడా షూటింగులో చాలా బాగా వచ్చింది. ఈ పాత్రలో నటించడం నాకు చాలా నచ్చింది. ఇది ఏదో సాదాసీదా పాత్ర కాదు కదా. ఛాలెంజ్ తో కూడుకున్న రోల్. మొదట్లో సరిగ్గా చేయగలనా లేదా డౌట్ పడ్డా. ఒక్కోసారి ఐదారు టేకులు తీసుకోవాల్సి వచ్చింది. చేస్తున్న కొద్దీ రోల్ ఎంజాయ్ చేయడం మొదలెట్టాను. ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది’’ అంటోంది మంజిమ.
తనకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టమని చెబుతోంది ఈ జామ్ జామ్ భామ. 14 ఏళ్లకే యాక్టింగ్ మొదలెట్టేశానని.. కానీ చదువు కంప్లీట్ అయ్యాకే సినిమాల్లోకి వెళ్లాలని తల్లిదండ్రులు కండిషన్ పెట్టడంతో మొత్తానికి డిగ్రీ కంప్లీట్ చేశానని చెప్పుకొచ్చింది.