నా మొగుడు సూప‌ర్ అంటున్న అమెరికా కోడ‌లు

Update: 2020-07-21 07:35 GMT
ఇండియా-అమెరికా పెనుబంధం కేవ‌లం ఉద్యోగాలు బిజినెస్ ల ప‌రంగానే కాదు.. ప్రేమానుబంధాల ప‌రంగానూ ఓ రికార్డేన‌ని చెప్పాలి. ఇక్క‌డి వాళ్లు అక్క‌డ సెటిలై పెళ్లి బంధంతో ఒక‌ట‌వుతున్నారు.  ఇండియ‌న్ గాళ్స్ తో ప్రేమాయ‌ణాల‌కు అక్క‌డి యువ‌కులు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. మ‌హ‌మ్మారీ నేప‌థ్యంలో భార‌తీయుల‌కు అమెరికాతో ఉన్న అనుబంధం ఎలాంటిదో ప‌దే ప‌దే గుర్తు చేసుకోవాల్సిన స‌న్నివేశం త‌లెత్తింది. అమెరికా వీసాల ర‌ద్ధు నిర్ణ‌యంతో ట్రంప్ బ‌య‌పెట్టేస్తున్నా అమెరికాను వీడేది లేదంటే భార‌తీయులు అభిమానం కురిపిస్తున్నారు.

ప్ర‌స్తుత స‌న్నివేశంలో అమెరికన్ సింగ‌ర్ కం న‌టుడు నిక్ జోనాస్ ని పెళ్లాడిన భార‌తీయ క‌థానాయిక ప్రియాంక చోప్రా ప్ర‌ముఖంగా చ‌ర్చ‌ల్లోకి వ‌స్తోంది. ఇక నిక్ జోనాస్ ని పీసీ ప్రేమించి పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. తొలుత నిక్ స్వ‌యంగా పీసీకి ప్ర‌పోజ్ చేశాడు. త‌న‌ని పెళ్లాడ‌మ‌ని కోరాడు. అందుకు సిగ్గుల మొగ్గ అయిపోయిన ప్రియాంక చోప్రా ఆ ప్ర‌పోజ‌ల్ ని న‌మ్మ‌లేక‌పోయింద‌ట‌. నిక్ ప్రేమ‌ను కాద‌న‌లేక‌పోయింది. వెంట‌నే ఓకే చెప్పేసింది. అయితే ఆ త‌ర్వాత‌నే అస‌లు క‌థ మొద‌లైంది. ప్రియానిక్ జంట‌పై ప్ర‌ముఖ అమెరిక‌న్ మ్యాగ‌జైన్ ఓ కుట్ర‌పూరిత క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

ఆ ఇద్ద‌రికీ పెళ్లి త‌ర్వాత‌ అస్స‌లు పొస‌గ‌డం లేద‌ని త్వ‌ర‌లోనే ఈ జంట విడాకులు తీసుకుని విడిపోయేందుకు సిద్ధ‌మ‌వుతోంద‌ని కారు కూత‌లు కూసింది. కానీ ఇవేవీ వారిని కుంగుబాటుకు గురి చేయ‌లేదు. స‌రిక‌దా ఆ ఇద్ద‌రి మ‌ధ్యా అనుబంధం ఇంకా పెరిగింది. జూన్ 20 నాటికి ఈ జంట ప్ర‌పోజ‌ల్ కి రెండు సంవ‌త్స‌రాలైంది‌. రెండేళ్ల క్రితం నిక్ త‌న పుట్టిన‌రోజు నాడు త‌న‌కు ప్ర‌పోజ్ చేశాడ‌ని.. ఎస్ అని చెప్పి రెండేళ్లు అయిపోయింద‌ని పీసీ తాజాగా ఎమోష‌న్ కి గురైంది. నేను చాలా ల‌క్కీ.. నిక్ త‌న‌కు ద‌క్క‌డం! అంటూ ఉద్వేగానికి లోన‌య్యింది.

ఈ రెండేళ్ల‌లో ఎంతో ఆనందంగా గ‌డిపామ‌ని.. కాపురంలో మ‌ధురిమ‌ల్ని ఆస్వాధించామ‌ని పీసీ తెలిపింది. 2018 మేలో నిక్ ప్రియాంక డేటింగ్ మొద‌లైతే.. అత‌డు ప్ర‌పోజ్ చేయ‌గానే త‌న‌కు మైకం క‌మ్మేసినంత ప‌నైంద‌ని కూడా పీసీ తెలిపింది. తాజాగా రెండేళ్ల ప్రేమైక జీవ‌నంపై ట్వీట్ చేసిన పీసీ పోస్టింగుకి నిక్ స్పందించాడు. ప్ర‌పోజ్ చేయ‌గానే అంగీక‌రించినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపి `ఐ ల‌వ్ యు బ్యూటిఫుల్` అంటూ పొగ‌డేశాడు.
Tags:    

Similar News